ఆ డైరెక్టర్ నాతో బిగుతైన బికినీ వేయించి.. నటి సంచలన కామెంట్స్!

Published : Oct 05, 2018, 12:20 PM IST
ఆ డైరెక్టర్ నాతో బిగుతైన బికినీ వేయించి.. నటి సంచలన కామెంట్స్!

సారాంశం

బాలీవుడ్ లో సినిమాలు, సీరియళ్ల షూటింగ్ సమయంలో మహిళలకు రక్షణ ఉండడం లేదని పలువురు నటీమణులు బయటకొచ్చి సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే తనుశ్రీదత్తా బాలీవుడ్ స్టార్ నటులు, దర్శకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆమెకు మద్దతుగా పలువురు సినీతారలు నిలుస్తున్నారు.

తాజాగా టీవీ నటి సప్నా పబ్బీ లైంగిక వేధింపులపై నోరు విప్పారు. తెలుగులో ఆమె 'తొలిప్రేమ' సినిమాలో ఓ పాటలో కనిపించారు. బాలీవుడ్ లో అయెం '24' సిరీస్ షూటింగ్ లో పాల్గొన్నప్పుడు దర్శకుడు తనపట్ల ఎంత దురుసుగా ప్రవర్తించాడో చెప్పుకొచ్చింది. ఓ పాటకి రిహార్సల్స్ చేస్తోన్న సమయంలో దర్శకుడు ఆమెని ఓ బిగుతైన బికినీ వేసుకోమని చెప్పడంతో ఆమె వేసుకోక తప్పలేదు. 

ఆ బికినీ వేసుకోవడం ఇబ్బందిగా అనిపించిందని ఆ సమయంలో ఆమె ఇచ్చిన సలహాలను ఎవరూ పట్టించుకోలేదని చెప్పింది. పైగా తన మాటలకు దర్శకుడు, స్టైలిస్ట్(ఫిమేల్) వెకిలిగా నవ్వి మరింత బాధ పెట్టారని ఆమె తెలిపింది.

తనకు ఇబ్బందికరంగా అనిపించినా ఆ బికినీ వేసుకొని ఏడు గంటల పాటు ఉండాల్సివచ్చిందని.. దాని కారణంగా ఛాతీలో నొప్పి వచ్చిందని సప్నా వెల్లడించారు. దర్శకుడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ ప్రోగ్రాం నుండి తప్పిస్తారనే భయంతో ఇన్నాళ్లుగా ఈ విషయాన్ని బయటపెట్టలేదని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు గట్టిగా ఇచ్చిపడేసిన కార్తీక్- మనుమడిని మెచ్చుకున్న పారు
Bayilone Ballipalike : దుమ్ములేపుతున్న మంగ్లీ ఫోక్ సాంగ్, 10 రోజుల్లోనే ఎన్ని కోట్ల వ్యూస్ రాబట్టిందంటే?