పెళ్లి చూపుల్లో లక్ష్మీ ప్రణతి నాకు ఒకే చెప్పలేదు, భార్యపై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

By team teluguFirst Published Sep 3, 2021, 9:49 AM IST
Highlights

 ఓ టాపిక్ గురించి మాట్లాడుతూ ఈరోజుల్లో పెళ్లి చూపుల్లో అమ్మాయిలు మాట్లాడడానికి అంతగా భయపడరు, కానీ నా భార్య లక్ష్మీ ప్రణతి మాత్రం ఒక్క మాట మాట్లాడలేదని ఎన్టీఆర్ అన్నారు. 

ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో ఆసక్తికరంగా సాగుతుంది. ఈ షో వేదికగా ఎన్టీఆర్ తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించడం విశేషం. ఓ టాపిక్ గురించి మాట్లాడుతూ ఈరోజుల్లో పెళ్లి చూపుల్లో అమ్మాయిలు మాట్లాడడానికి అంతగా భయపడరు, కానీ నా భార్య లక్ష్మీ ప్రణతి మాత్రం ఒక్క మాట మాట్లాడలేదని ఎన్టీఆర్ అన్నారు. 


లక్ష్మీ ప్రణతితో నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఆమెను చూసిన వెంటనే నేను ఒకే చెప్పాను. లక్ష్మీ ప్రణతి మాత్రం అసలు నోరు తెరవలేదు.ఆమె ఎస్ చెప్పలేదు, అలాగని నో అని కూడా చెప్పలేదు. అసలు నీకు ఈ పెళ్లి ఇష్టమేనా లేక బలవంతంగా చేస్తున్నారా అని అడిగాను, అప్పుడు కూడా లక్ష్మీ ప్రణతి మనసులో మాట చెప్పలేదని ఎన్టీఆర్ అన్నారు.  నిశ్చితార్థం తరువాత పెళ్ళికి ఎనిమిది నెలల గ్యాప్ వచ్చింది. అప్పుడు కూడా లక్ష్మీ ప్రణతి తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదని ఎన్టీఆర్ తెలియజేశారు. 


ఆడవాళ్ళ మనసును అర్థం చేసుకోవడం ఎంత కష్టమో అప్పుడు తనకు అర్థమైందని, అది తెలిసిన వాడు ప్రపంచాన్ని ఏలుతాడని ఎన్టీఆర్ కామెంట్ చేశారు. 2011 మే 5న ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి వివాహం జరిగింది. పదేళ్ల వైవాహిక జీవితంలో వీరికి ఇద్దరు సంతానం కలరు. పెద్ద అబ్బాయి పేరు అభిరామ్ కాగా, చిన్నవాడి పేరు భార్గవ్ రామ్. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆమె మీడియాలో ఫోకస్ కావడానికి పెద్దగా ఆసక్తి చూపారు. 
 

click me!