టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఈడీ ఎదుట విచారణకు రానా, కెల్విన్

By Siva KodatiFirst Published Sep 8, 2021, 2:28 PM IST
Highlights

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరో రానా ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆడిటర్ సతీశ్, అడ్వకేట్‌లతో కలిసి రానా ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆయనను ముగ్గురు ఈడీ అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. 2015-17 మధ్యకాలంలో బ్యాంక్ స్టేట్ మెంట్‌ను ఈడీ అధికారులకు రానా సమర్పించారు
 

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సూత్రధారిగా వున్న కెల్విన్ మరోసారి ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. నిన్న ఆరు గంటల పాటు అతనిని ప్రశ్నించిన అధికారులు .. ఇవాళ మరోసారి రావాలని ఆదేశించారు. దీంతో కెల్విన్ ఈడీ ఆఫీసుకు వెళ్లాడు. టాలీవుడ్ నటులుకు డ్రగ్స్ సరఫరా.. ఖాతాల్లోకి భారీగా నగదు ట్రాన్స్‌ఫర్ అయిన అంశాలకు సంబంధించి అధికారులు అతని నుంచి వివరాలు రాబట్టారు. మొత్తం 30 ఖాతాల ద్వారా కెల్విన్‌కు వున్న రెండు బ్యాంకు ఖాతాల్లోకి భారీగా నిధులు వచ్చినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. కెల్విన్‌తో పాటు వాహీద్, ఖుద్దూస్ అనే మరో ఇద్దరు నిందితుల్ని విడివిడిగా ప్రశ్నించారు ఈడీ అధికారులు.

విచారణకు ముందే డ్రగ్స్ కేసులో నిందితులుగా వున్న వారి ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. కెల్విన్ ఇంట్లో నాలుగు గంటల పాటు తనిఖీలు చేసిన అధికారులు .. వాహీద్ , ఖుద్దూస్ ఇళ్లలోనూ సోదాలు చేశారు. ముగ్గురి ఇళ్ల నుంచి లాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కెల్విన్ ఇంట్లో వున్న నగదును కూడా సీజ్ చేశారు. మరోవైపు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరో రానా ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆడిటర్ సతీశ్, అడ్వకేట్‌లతో కలిసి రానా ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆయనను ముగ్గురు ఈడీ అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. 

2015-17 మధ్యకాలంలో బ్యాంక్ స్టేట్ మెంట్‌ను ఈడీ అధికారులకు రానా సమర్పించారు. రెండు బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలను అందించారు ఆయన. రానా ఖాతా నుంచి కొన్ని అనుమానిత ఆర్ధిక లావాదేవీలు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులకు డబ్బులు బదలాయించారని అవి ఎవరెవరికీ ఇచ్చారు. ఎందుకిచ్చారు అనే కోణంలో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ మొత్తం ఎఫ్ కేఫే చుట్టూనే తిరుగుతోంది. ఇది హీరో నవదీప్‌కు చెందిన కేఫేగా తెలుస్తోంది. దీని కేంద్రంగా డ్రగ్స్ రాకెట్ నడిచినట్లుగా తెలుస్తోంది. ఇక్కడే సెలబ్రెటీలు డ్రగ్స్ తీసుకున్నారని.. కెల్విన్ ఇక్కడ పార్టీలు ఇచ్చాడని అధికారులు గుర్తించారు. 

click me!