‘బిచ్చగాడు’ హీరో చేసిన పనికి..మన హీరోలకు మండుతోంది

By Surya PrakashFirst Published May 6, 2020, 10:36 AM IST
Highlights

  హీరో విజయ్‌ ఆంటోనీ తన పారితోషికంలో పాతిక శాతాన్ని తగ్గించుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ మూడు సినిమాలకు సంబంధించి నిర్మాతలకు అండగా ఉండేందుకు తన పారితోషికంలో 25 శాతాన్ని వదులుకున్నారు విజయ్‌ ఆంటోనీ. అయితే ఈ వార్త ఇప్పుడు తెలుగు పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది. తెలుగులోనూ ఈ తరహా ప్రకటన హీరోలు చేయాలని చాలా మంది నిర్మాతలు కోరుకుంటున్నారు.


కరోనా ఎఫెక్ట్ తో హీరోలు రెమ్యునేషన్స్ తగ్గించుకోవాల్సిందే అంటూ కొద్ది రోజులు క్రితం ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ప్రకటన చేసారు. అయితే మన హీరోలెవరూ దాన్ని పట్టించుకున్నట్లు కనపడలేదు. తామెవరూ రెమ్యునేషన్స్ తగ్గించుకుంటామని చెప్పలేదు. అయితే  హీరో విజయ్‌ ఆంటోనీ తన పారితోషికంలో పాతిక శాతాన్ని తగ్గించుకుంటున్నట్లుగా తెలిపారు.
ఈ మూడు సినిమాలకు సంబంధించి నిర్మాతలకు అండగా ఉండేందుకు తన పారితోషికంలో 25 శాతాన్ని వదులుకున్నారు విజయ్‌ ఆంటోనీ. అయితే ఈ వార్త ఇప్పుడు తెలుగు పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది. తెలుగులోనూ ఈ తరహా ప్రకటన హీరోలు చేయాలని చాలా మంది నిర్మాతలు కోరుకుంటున్నారు. అయితే ఎవరూ హీరోలు దగ్గరకు వెళ్లి అడిగే పరిస్దితి లేదు. అయితే ఈ సిట్యువేషన్ క్రియేట్ చేసిన విజయ్ ఆంటోని పై తమిళ స్టార్ హీరోలు, తెలుగు హీరోలు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే...‘బిచ్చగాడు’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో విజయ్‌ ఆంటోని. ఆయన సినిమాలు ఇక్కడ కూడా స్ట్రెయిట్ గా రిలీజ్ అయ్యే స్దాయి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అయితే ఆ తర్వాత వరస డబ్బింగ్‌ సినిమాలతో టాలీవుడ్‌ను పలకరించినా.. బిచ్చగాడు రేంజ్‌ సక్సెస్‌ను సాధించలేకపోయారు. రీసెంట్ గా వచ్చిన  కిల్లర్‌ చిత్రం సైతం ఇక్కడ పెద్దగా పబ్లిసిటీ లేక చతికిల పడింది. తమిళంలో మాత్రం యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌తో కలిసి నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఆయన వరస పెట్టి ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు.  ప్రస్తుతం ఆయన ‘తమిళరసన్‌’, ‘అగ్ని సిరగుగళ్‌’, ‘ఖాకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు.

ఈ మూడు సినిమాలు కరోనా మహమ్మారి ప్రభావంతో సినిమాల షూటింగ్స్‌ నిలిచిపోయాయి, రిలీజులు ఆగాయి. ఇప్పటికే సినిమాలు ఆరంభించిన, తమ చిత్రాలను విడుదలకు సిద్ధం చేసిన నిర్మాతలు ఇరకాటంలో పడ్డారు. అందుకే విజయ్ ఆంటోని ఈ నిర్ణయం తీసుకున్నాడు,‘‘నిర్మాతల కష్టాలను అర్థం చేసుకుని పారితోషికం తగ్గించుకున్న విజయ్‌ ఆంటోనీకి ధన్యవాదాలు. నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ నిర్మాతలకు అండగా ఉండాల్సిన తరుణమిది. ప్రొడ్యూసర్స్‌ యాక్టర్‌గా విజయ్‌ ఆంటోనీ ఒక ఉదాహరణగా నిలిచారు’’ అన్నారు ‘ఖాకీ’ చిత్రనిర్మాత టి. శివ.  

click me!