మెగాస్టార్ చిత్ర నిర్మాతలకు ఇబ్బందులు తప్పవా..?

By Satish ReddyFirst Published Jun 2, 2020, 11:07 AM IST
Highlights

కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌ డౌన్‌ నుంచి సడలింపులు ఇస్తున్నారు. దీంతో షూటింగ్‌ లకు కూడా అనుమతులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అమితాబ్ లాంటి సీనియర్‌ నటుల విషయంలో షూటింగ్‌ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.

కరోనా సినీ రంగాన్ని తీవ్రంగా ఇబ్బందుల పాలు చేసింది. ఇప్పటికే షూటింగ్‌లతో పాటు ఇతర కార్యక్రమాలు అన్ని ఆగిపోవటంతో ఇప్పటికే వేల కోట్ల నష్టం వాటిల్లింది. దీనికితోడు షూటింగ్ లు లేకపోవటంతో రోజు వారి కూలి తోటి బతికే సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కేవలం చిన్న నటీనటులు కార్మికులను మాత్రమే కాదు. టాప్‌ స్టార్స్‌, లెజెండరీ దర్శక నిర్మాతలను కూడా కరోనా కష్టాల పాలు చేస్తోంది.

ముఖ్యంగా సినీయర్ నటీనటుల విషయంలో ఇండస్ట్రీ ఎలా వ్యవహరిస్తుందన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ నుంచి సడలింపులు ఇస్తుండటంతో సినిమా షూటింగ్లకు కూడా అనుమతి ఇస్తున్నారు. అయితే షూటింగ్ విషయంలో ప్రభుత్వం కొన్ని నింబంధనలు విధించింది. ప్రధానం కోవిడ్ నింబంధనలు పాటించటంతో పాటు చిన్న పిల్లలను వృద్ధులను షూటింగ్ లొకేషన్లకు అనుమతించ కూడాదన్న నింబంధన కూడా ప్రధానంగా తెర మీదకు వస్తోంది.

దీంతో అమితాబ్‌ బచ్చన్ లాంటి నటీనటులు విషయంలో పరిశ్రమ ఎలాంటి ప్రత్యామ్నాయాలు తెర మీదకు తెస్తారా అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అమితాబ్ బాలీవుడ్‌లో 7 సినిమాల్లో నటిస్తున్నాడు. వీటిలో బ్రహ్మాస్త్ర లాంటి భారీ బడ్జెట్‌ చిత్రాలు కూడా ఉన్నాయి. మరి ఈ సినిమా షూటింగ్ ఎలా చేస్తారు. అమితాబ్‌ లాంటి లెజెండరీ ఆర్టిస్ట్‌ ల కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా పర్మిషన్లు ఇస్తాయా? అన్న చర్చ జరుగుతోంది.

అయితే నిర్మాతలు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌ పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలను కంప్లీట్ చేసి మిగతా సినిమాలను పరిస్థితులు చక్క బడే వరకు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

click me!