హాట్ టాపిక్: కరోనా.. అల్లు అరవింద్ కి కలిసివచ్చిందా?

By Surya PrakashFirst Published Mar 18, 2020, 8:11 PM IST
Highlights

ప్రభుత్వం దియేటర్లని బంద్ చేస్తూ జీఓ పాస్ చేసింది. అంతేకాదు జనాలకు ఖాళీగా ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్స్ అయిన పబ్ లతో పాటుగా, బార్లు కూడా బంద్ చేసింది. దాంతో యూత్ కు  ఖాళీగా ఉన్నోళ్లకు  ఎంటర్టైన్మెంట్ దొరకడం కష్టంగా ఉంది. 

కరోనా ప్రభావంతో ...ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ,దేశాల్లో సినిమా థియోటర్స్ ని బంద్ చేసారు. అలాగే రీసెంట్ గా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం దియేటర్లని బంద్ చేస్తూ జీఓ పాస్ చేసింది. అంతేకాదు జనాలకు ఖాళీగా ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్స్ అయిన పబ్ లతో పాటుగా, బార్లు కూడా బంద్ చేసింది. దాంతో యూత్ కు  ఖాళీగా ఉన్నోళ్లకు  ఎంటర్టైన్మెంట్ దొరకడం కష్టంగా ఉంది. అయితే మొన్న ఆదివారం  చాలా బోరింగ్ గా రాష్ట్ర ప్రజలు గడపాల్సి వచ్చింది. దాంతో  amazon, netflix లతో పాటుగా అహ అనే అప్లికేషనకు నిన్న ఒక్కరోజే వేలల్లో ఫాలోవర్లు పెరగడం మొదలైంది. మొదటగా అంతగా ఎవరూ పట్టించుకోక, ఆదరణ లేని అహాకు ఇపుడు విపరీతంగా క్రేజ్ పెరిగపోవటం షాక్ ఇచ్చి్ంది.

పూర్తి తెలుగు కంటెట్, అదీ లోకల్ కంటెంట్ ఉన్న యాప్ కావటంతో  అహ క్రేజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఎలా ప్రమోట్ చేయాలి అని అల్లు అర్జున్ ని, త్రివిక్రమ్ ని ఇధ్దరినీ సీన్ లోకి దింపుతున్న ఆయన... ఇప్పటివరకు లేని క్రేజ్ సడెన్ గా పెరిగిపోవడం తో అల్లు అరవింద్ తెగ సంతోషం లో మునిగి ఉన్నాడని చెప్తున్నారు.  ఈ సంవత్సరం అలా వైకుంఠపురం లో చిత్రం తో బ్లాక్ బస్టర్ నీ అందుకున్న అల్లు ఫ్యామిలీ కి కరోనా వైరస్ కూడా అదృష్టం గా మారిందని సోషల్ మీడియా అంటోంది. దాంతో  అమెజాన్ మరియు నెట్ ఫ్లిక్ లకు దీటుగా ఆహా గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలెట్టారుట.

అలాగే అమెజాన్ ప్రైమ్ లో సరిలేరు నీకెవ్వరు ఉంది. సన్ నెక్ట్స్ లో అల వైకుంఠపురములో ఇప్పటికే ఈ  సినిమా ఉంది. ఈ రెండు సినిమాలకు ఇప్పుడు మరోసారి డిమాండ్ పెరిగింది. థియేటర్లు బంద్ అవ్వడంతో, ఆల్రెడీ నడుస్తున్న సినిమాలు కూడా కాస్త డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఇందులో భాగంగా 10 రోజుల కిందటే విడుదలైన ఓ పిట్టకథ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లోకి వచ్చేసింది. ఇప్పుడు మరిన్ని సినిమాల్ని ఇలా కాస్త ముందుగానే స్ట్రీమింగ్ కు తెచ్చేలా సంప్రదింపులు చేస్తోంది అమెజాన్ ప్రైమ్.

click me!