బాలీవుడ్‌ నిర్మాత ఏక్తా కపూర్‌పై హైదరాబాద్‌లో క్రిమినల్‌ కేసు

By Satish ReddyFirst Published Jul 16, 2020, 11:15 AM IST
Highlights

ఏక్తాకపూర్‌తో పాటు ఏఎల్‌టీ బాలాజీ సంస్థకు సంబంధించిన శోభా కపూర్‌, జితేంద్ర కపూర్‌లపైన కూడా కేసు నమోదైంది. ఏక్తా నిర్మించి అన్‌ సెన్సార్డ్‌ సీజన్‌ 2 వెబ్‌ సిరీస్‌ నేపథ్యంలో ఈ వివాదం చెలరేగింది. ఈ సిరీస్‌లోని ప్యార్‌ ఔర్‌ ప్లాస్టిక్ అనే ఎపిసోడ్‌లో ఆర్మీ దుస్తులను అభ్యంతరకరంగా చూపించారని ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ ఈ మేరకు కేసు నమోదైంది.

వివాదాస్పద బాలీవుడ్‌ నిర్మాత ఏక్తా కపూర్‌పై హైదరబాద్‌లో కేసు నమోదైంది. ఇటీవల ఏక్తా నిర్మించిన ఓ వెబ్‌ సిరీస్‌లో ఆర్మీ దుస్తులను, చిహ్నాలను అవమానకరంగా చూపించారంటూ విమర్శలు వినిపించాయి. ఈ మేరకు ఆమె మీద కేసులు కూడా నమోదయ్యాయి. ముంబై మెజిస్టేట్‌ కోర్టుతో పాటు మరికొన్ని చోట్ల ఇందుకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. బిగ్‌ బాస్ షోతో పాపులర్‌ అయిన వికాస్ పథక్‌ నమోదు చేసిన ఈ కేసుపై ఆగస్టు 24న విచారణ జరపనున్నట్టుగా కోర్టు తెలిపింది.

ఈ మేరకు ఏక్తాకపూర్‌తో పాటు ఏఎల్‌టీ బాలాజీ సంస్థకు సంబంధించిన శోభా కపూర్‌, జితేంద్ర కపూర్‌లపైన కూడా కేసు నమోదైంది. ఏక్తా నిర్మించి అన్‌ సెన్సార్డ్‌ సీజన్‌ 2 వెబ్‌ సిరీస్‌ నేపథ్యంలో ఈ వివాదం చెలరేగింది. ఈ సిరీస్‌లోని ప్యార్‌ ఔర్‌ ప్లాస్టిక్ అనే ఎపిసోడ్‌లో ఆర్మీ దుస్తులను అభ్యంతరకరంగా చూపించారని ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ ఈ మేరకు కేసు నమోదైంది.

ఏక్తాకపూర్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్నారు. పలు చిత్రాలకు ఆమె దర్శకురాలిగా కూడా పనిచేశారు. 1994లో ఏర్పాటు చేసిన బాలాజీ టెలీ ఫిలింస్‌ సంస్థలక ఆమె క్రియేటివ్‌ హెడ్‌గా కొనసాగుతున్నారు. ఇటీవల ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును సైతం ఇచ్చింది. అదే సమయంలో ఆమె రూపొందించే సినిమాలు తరుచూ వివాదాస్పదమవుతుంటాయి.

click me!