కంగనా భద్రత కోసం కేంద్రం అన్ని లక్షలు ఖర్చు చేస్తుందా..!

By Satish ReddyFirst Published Sep 15, 2020, 8:59 AM IST
Highlights

హీరోయిన్ కంగనా రనౌత్ కి కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అందించిన సంగతి తెలిసిందే. ఐతే కంగనాకు వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించడం కోసం లక్షల ఖర్చు పెట్టడానికి లాయర్ బ్రిజేష్ కలప్ప అభ్యన్తరం తెలిపారు. ఆయన చెప్పిన లెక్క లక్షల్లో ఉండడం గమనార్హం. 
 

కంగనా రనౌత్ తనకు ప్రాణ హాని ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం భద్రత కల్పించాలని అభ్యర్ధించారు. ఆమె అభ్యర్థన మన్నిస్తూ కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించడం జరిగింది. మహారాష్ట్ర గవర్నమెంట్ తో వివాదం పెట్టుకున్న కంగనా కేంద్రం అందించిన భద్రత మధ్య ముంబైలో అడుగుపెట్టారు. కంగనా ముంబైకి వచ్చాక మరిన్ని గొడవలు జరిగాయి. మహారాష్ట్ర సర్కార్ కంగనా ఆఫీస్ ని కూల్చివేయడం జరిగింది. ఐతే కోర్ట్ ఆదేశాలతో కూల్చివేతను తాత్కాలికంగా ఆపివేశారు. 

ఈ సంఘటన తరువాత కంగనా మరింతగా రెచ్చిపోయింది. సోషల్ మీడియా ద్వారా సీఎం ఉద్దవ్ ఠాక్రే పై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, నా ప్రాణాలు పోయినా మీ అరాచకాలు బయటపెడతాను అని ఆమె హెచ్చరించారు. కంగనాకు శివ సేనకు మధ్య వివాదం ముదురుతుండగా ఆమె ముంబై వీడి హోమ్ టౌన్ మనాలికి వెళ్లిపోయారు. ఐతే కంగనాకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించడంపై అభ్యన్తరం తెలుపుతూ లాయర్ బ్రిజేష్ కలప్ప ట్వీట్ చేశారు. మనాలి చేరుకున్న కంగనా సురక్షితంగా ఉన్నారని, ఆమెకు ప్రభుత్వం ఇచ్చిన వై ప్లస్ సెక్యూరిటీ ఉపసంహరించాలని కోరారు. 

అలాగే ఒక వ్యక్తికి వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అందించడం వలన రూ. 10 లక్షల ఖర్చు అవుతుంది. ప్రజల కట్టిన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం ఇలా ఖర్చుపెడతారా అని ప్రశ్నించారు. దీనికి కంగనా కౌంటర్ ఇచ్చారు. భద్రత అనేది ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఆధారంగా ఇస్తారని, ఒక వేళ నాకు ఎటువంటి హాని లేదని వారి ఆపరేషన్స్ ద్వారా తెలిస్తే ప్రభుత్వం ఉపసంహరిస్తుందని అన్నారు. తాను కూడా అదే కోరుకుంటున్నట్లు తెలిపారు. ఏదిఏమైనా కంగనా భద్రత కోసం ప్రభుత్వం అన్ని లక్షల ఖర్చుబెడుతుందా అని అనిపిస్తుంది. 

click me!