ఆ వీడియో డిలీట్‌ చేయండి.. గాయనిని కోరిన పోలీసులు

By Satish ReddyFirst Published Jul 11, 2020, 5:04 PM IST
Highlights

తూత్తుకుడి జిల్లా శంకరన్‌కోవిల్‌ సమీపంలోని సాత్తాన్‌కులం ప్రాంతంలో జయరాజ్, బెనిక్స్‌ అనే తండ్రీకొడుకులు లాకప్‌లో మరణించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో అరెస్టైన తండ్రీ కొడుకులను పోలీస్‌ దారుణంగా హింసించటంతో మరణించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి.

ఇటీవల తమిళనాట తండ్రి కొడుకుల లాకప్‌డెత్‌ వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై గాయని సుచిత్ర తన సోషల్‌ మీడియా పేజ్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో ఉన్న విషయాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసుశాఖ వీడియోను డిలీట్‌  చేయాల్సిందిగా సుచిత్రను కోరారు. పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురైన కారణంగానే వారు మరణించారంటూ సుచిత్ర ఆరోపించటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. జరిగన సంఘటనకు సుచిత్ర ఆరోపణలకు అసలు పొంతన లేదన్నారు పోలీసు అధికారులు.

తన ఇమాజినేషన్‌ను జోడించి ఆ ఘటనను సంచలనంగా మార్చేందుకు సుచిత్ర ప్రయత్నించిందన్నారు పోలీసులు. ఆమెకు సంబంధించి సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచి వీడియోను వెంటనే తొలగించాలని పోలీసులు సుచిత్రకు సూచించారు. ఈ మేరకు పోలీస్‌ డిపార్ట్‌మెంట్ అధికారిక ట్విటర్‌లో సూచనలు చేశారు. సీబీ సీఐడీ అధికారులు సూచించటంతో సుచిత్ర వీడియోను తొలగించినట్టుగా తెలుస్తోంది.


తూత్తుకుడి జిల్లా శంకరన్‌కోవిల్‌ సమీపంలోని సాత్తాన్‌కులం ప్రాంతంలో జయరాజ్, బెనిక్స్‌ అనే తండ్రీకొడుకులు లాకప్‌లో మరణించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో అరెస్టైన తండ్రీ కొడుకులను పోలీస్‌ దారుణంగా హింసించటంతో మరణించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ విచారణలో కూడా వారిని పోలీసులు తీవ్రంగా కొట్టినట్లు వెల్లడైంది.

ఈ ఘటనపై సినీ, క్రీడా, రాజకీయ రంగాల ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గాయని సుచిత్ర ఈ దారుణ ఘటన జరిగిన వెంటనే స్పందించి తన సోషల్‌ మీడియా అకౌంట్లో ఇందుకు సంబంధించిన వివరాలను షేర్‌ చేశారు.

click me!