యాక్సిడెంట్ ఎఫెక్ట్: రాజ్ తరుణ్ పై కేసు నమోదు..!

By AN TeluguFirst Published Aug 22, 2019, 11:16 AM IST
Highlights

నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అల్కాపూరిలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం మిస్టరీ ఎట్టకేలకు వీడింది. యువ నటుడు రాజ్‌తరుణ్‌ ట్విటర్‌ ద్వారా అల్కాపూరిలో జరిగిన సంఘటనపై స్పందించడంతో ఈ మిస్టరీ వీడింది. 
 

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రయాణిస్తోన్న కారు యాక్సిడెంట్ కి గురైంది. మంగళవారం తెల్లవారుజామున నార్సింగి వద్ద అల్కాపూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై రాజ్ తరుణ్ కారుకి యాక్సిడెంట్ జరిగింది.

ఆటోమేటిక్ గేరు ఉన్న కారు కావడంతో సాంకేతికంగా ఎలా నడపాలో తెలియక.. వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కారు స్పీడ్ గా వెళ్లి డివైడర్ ని ఢీకొట్టడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

కారులో ఉండే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై రాజ్ తరుణ్ స్పందించి తనకు యాక్సిడెంట్ జరిగిన విధానాన్ని వెల్లడించాడు. తన వాహనం అదుపుతప్పి డివైడర్ ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు అతడు ట్విట్టర్ లో వెల్లడించాడు.

దీంతో నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ రమణగౌడ్‌ మాట్లాడుతూ హీరో రాజ్‌తరణ్‌ ట్విట ద్వారా స్పందించడంతో అతడికి నోటీసులు అందించి విచారించనున్నట్లు తెలిపారు. విచారణ పూర్తయిన తరువాత అతడిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.

'తాగి డ్రైవ్ చేశావా..?' నెటిజన్ ప్రశ్నపై రాజ్ తరుణ్ రియాక్షన్!

రాజ్ తరుణ్ కారుకి యాక్సిడెంట్.. త్రుటిలో తప్పిన ప్రమాదం!

కారు వదిలేసి పారిపోయిన రాజ్ తరుణ్.. అసలేం జరిగిందంటే..?

రాజ్ తరుణ్ పారిపోవడంపై పోలీసుల అనుమానాలు ఇవే!

యాక్సిడెంట్ ఘటనపై క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్

click me!