బయటపడ్డ `బిగ్‌బాస్‌5` హౌజ్‌లోని మానస్‌-ప్రియాంక, సిరి-జెస్సీల లవ్‌ ట్రాక్స్..

By Aithagoni RajuFirst Published Sep 12, 2021, 11:36 PM IST
Highlights

 ఆదివారం జరిగిన షోలో సరయు ఫైరింగ్‌ హైలైట్‌గా మారిందని చెప్పొచ్చు. కానీ అంతకంటే ముందు కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ర్యాంపు వాక్‌లు, జోడీలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. అదే సమయంలో హౌజ్‌లో లవ్‌ ట్రాక్స్ కూడా ఫస్ట్ వారాంతంలోనే బయటపడటం విశేషం. 

బిగ్‌బాస్‌5 మొదటి వారం విజయవంతంగా ముగిసింది. ఇందులో ఫస్ట్ ఎలిమినేషన్‌ సరయు అయ్యారు. ఆమె వెళ్తూ వెళ్తూ తన ఫేవరేట్‌ ఐదుగురుని, వరస్ట్ ఐదుగురి గురించి చెప్పింది. అయితే ఆదివారం జరిగిన షోలో సరయు ఫైరింగ్‌ హైలైట్‌గా మారిందని చెప్పొచ్చు. కానీ అంతకంటే ముందు కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ర్యాంపు వాక్‌లు, జోడీలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. అదే సమయంలో హౌజ్‌లో లవ్‌ ట్రాక్స్ కూడా ఫస్ట్ వారాంతంలోనే బయటపడటం విశేషం. 

ఆదివారం నాగార్జున ఎంట్రీ తర్వాత ఇంటి సభ్యులను జతగా కలిసి ర్యాంప్‌ వాక్‌ చేయాలని తెలిపారు. జెస్సీ జడ్జ్ గా ఉంటారని, తాను సైతం జడ్జ్ గా ఉంటానని తెలిపాడు నాగ్‌. అలా విశ్వ-సరయు, లోబో-ఉమాదేవి, రవి-హమీద, షణ్ముఖ్‌-ప్రియా, మానస్‌-లహరి, సిరి-శ్రీరామచంద్ర, కాజల్‌-సన్నీ, శ్వేత-ప్రియాంక ర్యాంపు వాక్‌లో అదరగొట్టారు. ఇందులో లోబో, ఉమాదేవి ఆద్యంతం నవ్వులు పూయించింది. శ్వేత, ప్రియాంక చేసిన వాక్‌ ప్రొఫేషనల్‌గా ఉందని పదికి పది మార్కులు పడ్డాయి. 

మరోవైపు ఇంటి సభ్యులు బిగ్‌బాస్‌ చెప్పిన ప్రకారం జంటలుగా మారి ఒకరి గురించి ఒకరి ఇష్టాఇష్టాలను తెలిపారు. నాగ్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిపారు. ఇదంతా ఆద్యం కడుపుబ్బా నవ్వించింది. ఇంత వరకు బాగానే ఉంది కానీ ఇందులో రెండు లవ్‌ ట్రాక్‌ బయటపడ్డాయి. జంటలుగా మారి ఇష్టాలను తెలిపే టాస్క్ లో లవ్‌ ట్రాక్స్ ఏంటో రివీల్‌ అయ్యాయి. సిరి- జెస్సీ కలిసి పాల్గొన్నారు. నీ కోసమే అని సిరి చెప్పడం, దానికి జెస్సీ పంచ్‌ వేయడంతో తమ మధ్య ఇంకేదో నడుస్తుందనే సిగ్నల్స్ ఇచ్చారు. 

అదే సమయంలో ప్రియాంక క్రష్‌ కూడా బయటపడింది. ఆమె మానస్‌ ఎలిమినేషన్‌ నుంచి సేవ్ అయినప్పుడు హమ్మయ్య మానస్ సేవ్‌ అయ్యాడంటూ ప్రియా చేతులు పట్టుకుందట. ఈ విషయాన్ని ఆమె చెప్పడంతో అసలు గుట్టు రట్టు అయినట్టయ్యింది. మొత్తంగా పరోక్షంగా మానస్‌తో తనకున్న క్రష్‌ని బయటపెట్టింది ప్రియాంక. అయితే ఎలిమినేషన్‌ విషయంలోనూ ఈ సారి అంతగా సీరియస్‌గా అనిపించలేదు. మొదటి వారం కాబట్టి ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ రక్తికట్టలేదు. అంతా ఊహించినట్టే జరుగుతూ వచ్చింది. నిన్నటి నుంచి వినిపిస్తున్నట్టుగానే సరయు ఎలిమినేట్‌ అయ్యారు.  

click me!