అభిజిత్‌, హారికలకు నాగ్‌ ఫనిష్‌మెంట్‌..మోనాల్‌పై ప్రశంసలు.. సారీకి కారణమదేనా?

Published : Oct 03, 2020, 10:59 PM IST
అభిజిత్‌, హారికలకు నాగ్‌ ఫనిష్‌మెంట్‌..మోనాల్‌పై ప్రశంసలు.. సారీకి కారణమదేనా?

సారాంశం

అభిజిత్‌, హారిక, అలాగే అరియానాలు ఇంగ్లీష్‌లోనే ఎక్కువసార్లు మాట్లాడారు. దీంతో వారికి నాగ్‌ క్లాస్‌ పీకాడు. అంతటితో ఆగలేదు, వారిని ఆ సెషన్‌ మొత్తం నిల్చో బెట్టి ఫనిష్‌మెంట్‌ ఇచ్చాడు. 

బిగ్‌బాస్‌4 సీజన్‌ ప్రారంభం నుంచి ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ తెలుగులో మాట్లాడాలని నాగ్‌ కండీషన్‌ పెట్టాడు. సాధ్యమైనంత వరకు తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించాలని, వారు మాట్లాడే మాటలు ఆడియెన్స్ కి అర్థం కావాలని చెప్పారు. కానీ  కొందరు దాన్నిపాటించడం లేదు. దీంతో రెండో వారంలోనే వారికి ఫనిష్‌మెంట్‌ ఇచ్చారు. 

మళ్ళీ అదే జరుగుతుంది. ముఖ్యంగా అభిజిత్‌, హారిక, అలాగే అరియానాలు ఇంగ్లీష్‌లోనే ఎక్కువసార్లు మాట్లాడారు. దీంతో వారికి నాగ్‌ క్లాస్‌ పీకాడు. అంతటితో ఆగలేదు, వారిని ఆ సెషన్‌ మొత్తం నిల్చో బెట్టి ఫనిష్‌మెంట్‌ ఇచ్చాడు. 

మరోవైపు తాను బాగా తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించిన మోనాల్‌ని ప్రశంసించాడు నాగ్‌. అందుకు మోనాల్‌ స్పందనగా తెలుగులో ఓ పాట పాడింది. ఆ పాటకి సభ్యులేకాదు, నాగార్జున సైతం ఇంప్రెస్‌ అయ్యారు. 

ఇదిలా ఉంటే, అభిజిత్‌- మోనాల్‌ మధ్య చోటు చేసుకున్న వివాదం తెరపైకి వచ్చింది. మోనాల్‌ అఖిల్‌కి దగ్గరగా ఉండటం వల్ల వీరి మధ్య జరిగిన కాయిన్స్ గేమ్‌లోని ఓ తప్పిదానికి మోనాల్‌కి అభిజిత్‌ సారీ చెప్పలేదని తేలింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్
Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు