కనెక్షన్స్‌ పేరుతో కొత్త కిరికిరి పెట్టిన బిగ్ బాస్

By Satish ReddyFirst Published Sep 6, 2020, 7:50 PM IST
Highlights

నలుగురు కంటెస్టెంట్‌లు హౌస్‌లోకి ఎంటర్‌ అయిన తరువాత కొత్త కిరికిరి స్టార్ట్‌ చేశాడు బిగ్ బాస్‌. హౌస్‌లోకి వెళ్లిన నలుగురు కంటెస్టెంట్‌లకు కనెక్షన్స్‌ పేరుతో నాలుగు బాక్స్‌లు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చాడు.

బుల్లితెర బిగ్ ఎంటర్‌టైన్మెంట్ మొదలైంది. బిగ్ బాస్‌ సీజన్‌ 4 ఈ రోజు మొదలైంది. ఆరు గంటలకు నాగ్ ద్విపాత్రాభినయంతో షో ప్రారంభమైంది. ఆ తరువాత ఒక్కొక్కరుగా కంటెస్టెంట్‌లు హౌస్‌లోకి ఎంటర్‌ అవుతున్నారు. ఈ సమయంలో నలుగురు కంటెస్టెంట్‌లు హౌస్‌లోకి ఎంటర్‌ అయిన తరువాత కొత్త కిరికిరి స్టార్ట్‌ చేశాడు బిగ్ బాస్‌. హౌస్‌లోకి వెళ్లిన నలుగురు కంటెస్టెంట్‌లకు కనెక్షన్స్‌ పేరుతో నాలుగు బాక్స్‌లు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చాడు.

బిగ్‌బాస్‌4 కంటెస్టెంట్స్ లైవ్‌ అప్‌డేట్స్

ఆ బాక్స్‌ల్లో ఒక్కో ప్రాపర్టీ ఉంది. ఆ తరువాత హౌస్‌లోకి ఎంటర్‌ అవుతున్న మరో నలుగురు కంటెస్టెంట్‌లకు హౌస్‌లో ఉన్నవారితో కనెక్ట్ అయ్యేలా ప్రాపర్టీ ఉన్న బాక్స్‌లను గిప్ట్‌ ఇచ్చి లోపలికి పంపించారు. అయితే అలా కనెక్ట్ అయిన వారికి బిగ్‌ బాస్‌ ఎలాంటి కనెక్షన్‌ పెడతాడో చూడాలి. సూజత - మోనల్‌ గజ్జర్‌, మెహబూబ్‌ - లాస్య, సూర్య కిరణ్ - దేవీ నాగవల్లి, దేత్తడి  హారిక - అభిజిత్‌ల ప్రాపర్టీలు మ్యాచ్‌ అయ్యాయి.

click me!