బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో స్టార్ట్ అయ్యింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్‌ ఉంటుందని హోస్ట్ నాగార్జున చెబుతున్నాడు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఈ రియాలిటీ షో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.  నాగ్‌ నాన్న పాత్ర బిగ్‌బాస్‌ హౌజ్‌ని పరిచయం చేశారు. రంగురంగులతో వండర్‌ఫుల్‌గా ఉందని తెలిపారు. నెవర్‌ బిఫోర్‌ అంటూ, రెట్టింపు వినోదాన్నిస్తామని తెలిపారు. 

ఇక పదహారు మంది కంటెస్టెంట్స్ ఈ షోలో పాల్గొంటున్నట్టు పరోక్షంగా తెలిపారు. తాజాగా కంటెస్టెంట్స్ ని పరిచయం చేస్తున్నారు. 


1.మొదటి కంటెస్టెంట్స్ గా నటి మోనాల్‌ గజ్జర్‌ని పరిచయం చేశారు. తెలుగులో ఆమె ఐదు సినిమాలు చేశారు. గుజరాత్‌కి చెందిన మోనాల్‌ చాలా ఎమోషనల్‌ అని తెలిపింది. మొదటి కంటెస్టెంట్‌గా ఆమె బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎమోషనల్‌ అయ్యారు. 

2.బిగ్‌బాస్‌ 4 షోలో రెండో కంటెస్టెంట్‌గా దర్శకుడు సూర్య కిరణ్‌ ఎంటరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన గతంలోని కష్టసుఖాలను పంచుకున్నారు. తన గతంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వెళ్ళి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. మోనాల్‌ ని పరిచయం చేసుకున్నారు.

3.మూడో కంటెస్టెంట్‌గా యాంకర్‌ లాస్య ఎంటరయ్యారు. ఆమె ఎంటరవ్వడానికి ముందు స్పెషల్‌ వీడియోని ప్లే చేశారు. ఆమె అనుభవాలు, అనుభూతులు పంచుకున్నారు. ముఖ్యంగా తన బాబు గురించి చెబుతూ చాలా ఎమోషనల్‌ అయ్యారు. అంతేకాదు బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వెళ్ళే ముందు చిన్న బేబీ టాయ్‌ని నాగ్‌.. లాస్యకి గిఫ్ట్ గా అందించారు. ఈ సందర్భంగా ఆమె చెప్పిన ఓ కథ నవ్వులు పూయించింది. 

4.నాలుగో కంటెస్టెంట్‌గా అభిజిత్‌ వచ్చారు. ఆయన ఓ సాంగ్‌ తో ఎంటరయ్యాడు. అయితే ఈ సందర్భంగా అభిజిత్‌ `లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌` చిత్రంలో అమలతో కలిసి నటించానని తెలిపారు. అంతేకాదు కాదు కాజల్‌, పూజా హెగ్డే, తమన్నా ఫోటోలను చూపించి వీరిలో ఎవరితో డేటింగ్‌, ఎవరిని పెళ్ళి, ఎవరికి ముద్దు పెట్టుకుంటావని అడగ్గా, అభిజిత్‌ కాజల్‌తో డేట్‌ చేస్తానని, పూజాని పెళ్ళి చేసుకుంటానని, తమన్నాని ముద్దు పెట్టుకుంటానని తెలపడం ఆకట్టుకుంటుంది 

5.ఐదో కంటెస్టెంట్‌ టీవీ యాంకర్‌ జోర్దార్‌ సుజాత్‌ ఎంటరయ్యింది. ఈ స్థాయికి రావడానికి తానుపడ్డ కష్టాలను పంచుకుంది. ఎన్నో స్ట్రగుల్‌ పడి ఇక్కడి వరకు వచ్చానని తెలిపింది. తనదైన స్టయిల్‌లో తెలంగాణ యాసలో మాట్లాడి అలరించింది. అంతేకాదు నాగ్‌ని బిట్టు పిలిచి నవ్వులు పూయించింది.

6.ఆరో కంటెస్టెంట్‌గా మెహబూబ్‌ దిల్‌సే ఎంటరయ్యారు. ఆయన నాగ్‌ మాస్‌ సాంగ్‌కి స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. 

7.టీవీ9 టీవీ యాంకర్‌ దేవి నాగవల్లి ఎంటర్‌ అయ్యారు. గ్రాఫిక్‌ డిజైనర్‌ నుంచి టీవీ యాంకర్‌గా మారానని తెలిపింది. లైవ్‌ కవరేజ్‌ చేసి దేనితోనూ ఎక్కువగా కనెక్ట్ కాలేకపోతానేమో అనిపించిందని తెలిపింది. లేడీ ఫైర్‌ బ్రాండ్‌గా ఉండాలనుకుంటున్నానని తెలిపింది. `నక.. నక ` సాంగ్‌కి డాన్స్ లేసి ఆకట్టుకుంటుంది. 

8.డాన్సర్‌, యాంకర్‌, ఆర్టిస్ట్ దేత్తడి హారిక ఎనిమిదో కంటెస్టెంట్‌గా ఎంటర్‌ అయ్యారు. అదిరిపోయే డాన్స్ తో అదరగొట్టారు. బిగ్‌బాస్‌ని చిన్నప్పట్నుంచి చూసేదట. ఇప్పుడు ఏకంగా కంటెస్టెంట్‌గా రావడం డ్రీమ్‌ నెరవేరినట్టు తెలిపింది. నన్ను ఇలా చూసి అమ్మ చూసి బాగా ఎగ్జైట్‌ అవుతుందని తెలిపింది. 

9. తొమ్మిది, పది స్పెషల్‌ కంటెస్టెంట్స్ గా సయ్యద్‌ సోయల్‌ రిహాన్‌(ఇస్మార్ట్ సోయల్‌), అరియానా గ్లోరీ ఎంటర్‌ అయ్యారు. వీరిలో అరియానా గ్లోరీ తాను బోల్డ్ అంటూ ఓ స్పెషల్‌ ప్రోమో ఆకట్టుకుంటుంది. అంతేకాదు హైలైట్‌గా నిలిచింది. అయితే వీరిద్దరు సీక్రెట్‌ హౌజ్‌కి వెళ్లడం విశేషం. రెగ్యూలర్‌ హౌజ్‌లోకి కాకుండా స్పెషల్‌ హౌజ్‌లో వీరిద్దరు బిగ్‌బాస్‌ చెప్పినట్టు చేయాలి నాగ్‌ చెప్పారు. అయితే వీరిద్దరి ప్రాపర్టీస్‌ గిఫ్ట్స్ ఇవ్వకపోవడం గమనార్హం. 

10.పదకొండవ కంటెస్టెంట్‌గా అమ్మ రాజశేఖర్‌ ఎంటర్‌ అయ్యారు. ఆయన నాగ్‌ పాటలకు స్టెప్పులేసి సందడి చేశారు. అంతేకాదు ఆయనకు నాగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. షోలో అమ్మ రాజశేఖర్‌ భార్య రాధతో మాట్లాడారు.ఈ షోతో తనకు మళ్ళీ క్రేజ్‌ రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. 

11. 12వ కంటెస్టెంట్‌గా కరాటే కళ్యాణి వచ్చారు. ఈ సందర్భంగా తన ప్రోమోలో తాను పడ్డ కష్టాలను తెలిపారు. అంతేకాదు తనకు అమ్మ కావాలని ఉందని కాని కాలేకపోయానని, చాలా మంది తనని వాడుకుని మోసం చేశారని చెబుతూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. అందరిని భావోద్వేగానికి గురి చేసింది. చివరకు రంగస్థలం కళాకారిణిగా తాను చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి. 

12.13వ కంటెస్టెంట్‌గా నటుడు నోయల్‌ సీన్‌ ఎంటర్‌ అయ్యాడు. ఆయన తనదైన ర్యాప్‌ స్టయిల్‌లో బిగ్‌బాస్‌ 4 సాంగ్‌ పాడి ఆకట్టుకుంటున్నారు. నాగ్‌ని ఇంప్రెస్‌ చేశాడు. ఇక తాను బయట ఎలా ఉంటానో తన ఫ్యామిలీకి తెలియడం కోసం బిగ్‌బాస్‌4 ఉపయోగపడుతుందని తెలిపారు. 

13.పద్నాల్గవ కంటెస్టెంట్‌గా దివి వచ్చేశారు. నటన అంటే ఇష్టంతో మోడలింగ్‌ చేసి, అట్నుంచి నటిగా మారిందట. మొదల పలు వెబ్‌ సిరీస్‌ చేసిందట. ఇప్పుడు సినిమాలు చేస్తున్నానని తెలిపింది. బిగ్‌బాస్‌ 4తో బ్రేక్‌ పొందాలని భావిస్తుంది. 

14.పదిహేనవ కంటెస్టెంట్‌గా నటుడు అఖిల్‌ ఎంటరయ్యాడు. హైదరాబాద్‌ మోస్ట్ డిజైరబుల్‌ మెన్‌గా నిలిచిన అఖిల్‌.. నాగ్‌ నటించిన `సిసింద్రి`సినిమా విడుదలైన మరుసటి రోజున జన్మించాడట. అందుకే తనకు అఖిల్‌ పేరు పెట్టారట. రెండేళ్ళ క్రితం తన లవ్‌ ఫోయిల్‌ అయినట్టు తెలిపాడు. ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడట. తాను నిజాయితీగా ఉంటానని తెలిపాడు. అంతేకాదు నాగ్‌ ముందు యాభై డిప్స్ కొట్టి ఆశ్చర్యపరిచారు. తాను ఫిట్‌గా ఉంటానని చెప్పాడు. 

15.స్పెషల్‌ కంటెస్టెంట్‌గా తెలంగాణ యాసతో ఆకట్టుకుంటున్న గంగవ్వ ఎంటర్‌ అయ్యి అందరిని ఆశ్చర్యపరిచింది. బిగ్‌బాస్‌ చరిత్రలోనే కొత్త పుంతలు తొక్కించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తన కష్టాలు చెప్పుకుని అందరిని ఏడిపించేసింది. ఆమె బాధలు విని నాగ్‌ సైతం భావోద్వేగానికి గురయ్యారు. చివరకు ఆమె నాగ్‌ అందంపై సెటైర్లు వేసి కడుపుబ్బ నవ్వించింది. గంగవ్వతో లుక్కే మారిపోతుందని పెద్ద నాగ్‌ చెప్పడం విశేషం.