
మెగాబ్రదర్ నాగబాబు కొన్నిరోజులుగా బాలకృష్ణని టార్గెట్ చేస్తూ కౌంటర్లు వేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నేరుగానే బాలయ్యని టార్గెట్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. బాలయ్య చాలా సందర్భాల్లో తన కుటుంబాన్ని, అన్నదమ్ములను టార్గెట్ చేశాడని ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కి కౌంటర్లు ఇస్తున్నాడు నాగబాబు.
ముందుగా కౌంటర్ నెంబర్ 1 వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన స్పీచ్ లో ఎక్కడా.. బాలకృష్ణ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..
''గత కొంతకాలంగా నేనొక వ్యక్తి మీద చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది. నేను సాధారణంగా వివాదాల జోలికి వెళ్ళను. అలా చేసి ఫోకస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. నాకంటూ ఓ గుర్తింపు ఉంది. నేనెప్పుడూ పేరు ప్రఖ్యాతల వెంట పడలేదని'' అన్నారు.
పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని సదరు వ్యక్తి అంటే తను కౌంటర్ ఇచ్చారని అనుకున్నారని.. పోనీ ఒకసారి ఇచ్చారనుకుంటే అనుకోవచ్చు.. పదే పదే ఎందుకు కౌంటర్లు వేస్తున్నారని సోషల్ మీడియాలో తనను ప్రశ్నిస్తున్నట్లు చెప్పిన నాగబాబు.. ఆ వ్యక్తి ఇప్పటివరకు ఆరు సార్లు తన ఫ్యామిలీ మీద, అన్నదమ్ముల మీద కామెంట్స్ చేశారని ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు.
ఆ వ్యక్తి ఒక కామెంట్ తో వదిలిపెట్టాడని జనాలు అనుకుంటున్నారని కానీ అలా జరగలేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ అందరికీ తెలియాలని లేదని.. కానీ ఏ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ గెలుపుకి కారణమయ్యాడో.. అటువంటి వ్యక్తి ఎవరో తెలియదని చెప్పడం ఎంతగానో బాధించిందని ఎమోషనల్ అయ్యారు.
మీ పార్టీకి సహాయపడిన వ్యక్తి గురించి మీరు తెలియదన్నారు.. అలాంటప్పుడు మీరు నాకు తెలియదంటే మీ వాళ్లు ఎందుకంత ఫీల్ అవుతున్నారని బాలయ్యని ప్రశ్నించాడు. మీరు ఏమైనా అనొచ్చు.. మేమంటే కోపం వస్తాదా..? ఇది కరెక్ట్ కాదంటూ తన స్పీచ్ ముగించారు. రెండో కామెంట్ కోసం ఎదురుచూడమని టైమ్ కూడా చెప్పాడు నాగబాబు. మరో ఆ రెండో కామెంట్ ఏంటో మరికొన్ని గంటలలో తెలియనుంది.
ఎన్టీఆర్ బయోపిక్: బాలయ్యపై నాగబాబు సెటైరికల్ కవిత!
బాలయ్యకి నాగబాబు కౌంటర్..సోషల్ మీడియాలో వైరల్
బాలకృష్ణ మంచి కమెడియన్: నాగబాబు వ్యాఖ్య!
బాలయ్య, నాగబాబు ఎపిసోడ్.. టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ ఏంటంటే..?