
బుల్లితెర నటిగా ప్రేక్షకాదరణ పొందిన నటి నికిత(30) శనివారం నాడు మరణించారు. ప్రమాదవశాత్తు ఆమె టెర్రస్ నుండి జారి పడిపోవడంతో తలకు బలమైన గాయం తగిలింది. దీంతో వెంటనే ఆమెను కటక్ మహా నగరంలోఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.
కానీ గాయం బలంగా తగలడంతో ఆమె చనిపోయింది. సీరియల్స్, సినిమాలతో ఆమె ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వందకి పైగా ఆల్బమ్స్ లో ఆమె నటించారు. షార్ట్ ఫిల్మ్ తో నట జీవితాన్ని ప్రారంభించిన ఆమె 'గూండా', 'చోరీ చోరీ మన చోరీ', 'మా రా పనతకని' వంటి ఒడియా చిత్రాల్లో ఆమె నటించింది.
ఆమె ఆకస్మిక మరణంతో ఓలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. రెండేళ్ల క్రితం ఆమె నటుడు లిపన్ సాహుని పెళ్లాడింది.