రమ్యకృష్ణ.. నాగార్జునని ఫోర్స్ చేసిందా..?

Published : Jan 06, 2019, 12:21 PM IST
రమ్యకృష్ణ.. నాగార్జునని ఫోర్స్ చేసిందా..?

సారాంశం

ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన నటి రమ్యకృష్ణ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి వరుస విజయాలు అందుకుంటోంది. అయితే ఆమె భర్త దర్శకుడు కృష్ణవంశీ మాత్రం సరైన సినిమాలు తీయలేక ఫ్లాప్ రుచి చవిచూడాల్సి వస్తోంది.

ఒకప్పుడు కృష్ణవంశీ అంటే ఎగిరిగంతేసి సినిమాలు చేసే హీరోలు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. ఇప్పుడు తన భర్త కోసం రమ్యకృష్ణ రంగంలోకి దిగింది. కృష్ణవంశీ కోసం ఓ సీనియర్ హీరోని ఒప్పించింది. అతడు మరెవరో కాదు.. నాగార్జున. కృష్ణవంశీతో గతంలో 'నిన్నే పెళ్లాడతా', 'చంద్రలేఖ' వంటి సినిమాలకు పని చేశాడు నాగార్జున.

ఆ తరువాత వీరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. రమ్యకృష్ణకి నాగార్జునకు మధ్య ఉన్న స్నేహంతో తన భర్త డైరెక్ట్ చేయబోయే సినిమాలో హీరోగా నటించమని నాగార్జునని  ఒప్పించినట్లు సమాచారం. రమ్యకృష్ణ అంతగా అడగడంతో నాగ్ కూడా కాదనలేకపోయాడట. త్వరలోనే ఈ కాంబినేషన్ పై అధికార ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మొన్నామధ్య కృష్ణవంశీ మరాఠీ సినిమా 'నటసామ్రాట్' రీమేక్ హక్కులను కొనుగోలు చేశాడు. ప్రకాష్ రాజ్ లీడ్  రోల్ లో సినిమా చేయాలనుకున్నాడు. కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఆ కథనే నాగార్జునతో తీస్తాడా..? లేక మరో కథతో చేస్తారా..? అనే విషయంలో క్లారిటీ రావాల్సి వుంది!

PREV
click me!

Recommended Stories

Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే
Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్