ఆ విషయాలు విన్నప్పుడు తండ్రిగా బాధపడుతుంటా: కమల్ హాసన్

By Udayavani DhuliFirst Published Aug 15, 2018, 3:59 PM IST
Highlights

నా కూతుళ్లను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ ప్రపంచంలో ఏం జరిగినా ఎదుర్కోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. నిర్మాతలతో శృతిహాసన్ తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడేప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది

లోకనాయకుడు కమల్ హాసన్ తన ఇద్దరు కూతుళ్లను సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. మొదట సింగర్ గా తన కెరీర్ మొదలుపెట్టిన శృతిహాసన్ ఆ తరువాత నటిగా తెరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోయిన్ గా వెలుగొంది బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. అలానే కమల్ చిన్నకూతురు అక్షరహాసన్ కూడా నటిగా తన కెరీర్ స్టార్ట్ చేసింది.

పలు తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ఇలా ఆయన ఇద్దరు కూతుళ్లు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ తన కూతుళ్ల గురించి మాట్లాడుతూ ఓ సందర్భంలో తండ్రిగా బాధపడుతుంటా అని చెప్పారు. ఇంతకీ కమల్ ఎందుకు అలాంటి కామెంట్ చేశారంటే.. మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనల గురించి విన్నప్పుడు ఓ తండ్రిగా బాధపడుతుంటానని, అలా అని నా పిల్లల స్వేచ్ఛను లాక్కోలేనని ఆయన అన్నారు.

ఇంకా మాట్లాడుతూ.. 'నా కూతుళ్లను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ ప్రపంచంలో ఏం జరిగినా ఎదుర్కోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. నిర్మాతలతో శృతిహాసన్ తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడేప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది' అని అన్నారు. 

click me!