సినిమాలో కంటెంట్ ఉంటే మూడు గంటల సినిమా అయినా.. ఆడియన్స్ కి బోర్ కొట్టదని 'అర్జున్ రెడ్డి','రంగస్థలం' వంటి సినిమాలు నిరూపించాయి. దీంతో దర్శకనిర్మాతలు కూడా నిడివి మూడు గంటలు ఉన్నా.. ట్రిమ్ చేయకుండా ధైర్యంగా సినిమాను విడుదల చేస్తున్నారు.

అయితే అన్ని సార్లు ఇది వర్కవుట్ అవుతుందని చెప్పలేం. ఈ మధ్యకాలంలో కథ బాగుండి కేవలం నిడివి ఎక్కువ ఉన్న కారణంగా ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. తాజాగా ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
undefined
దీని నిడివి 2 గంటల 41 నిమిషాలు. అంటే ఇది పెద్ద సినిమా అనే తెలుస్తోంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన గత చిత్రం 'అజ్ఞాతవాసి' కూడా దాదాపు 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది. అరవింద సమేత నిడివి కూడా అంతే ఉండేలా చూసుకున్నాడు.
అయితే సెకండ్ హాఫ్ లో కథ కాస్త నెమ్మదిగా సాగుతుందని అంటున్నారు. ఈ క్రమంలో సినిమాకి నిడివి సమస్య అవుతుందేమోననే సందేహాలు వినిపిస్తున్నాయి. ఎమోషన్ గనుక పండితే నిడివి పెద్ద సమస్య కాకపోవచ్చు. మరి సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి!
ఇవి కూడా చదవండి..
ఎన్టీఆర్ తో చాలా ఇబ్బంది పడ్డా.. త్రివిక్రమ్ వ్యాఖ్యలు!
అరవింద సమేత స్పెషల్ షోలు.. ఫ్యాన్స్ కు బంపర్ అఫర్!
అరవింద సమేతపై చంద్రబాబు ప్రేమ: జూ.ఎన్టీఆర్ పై సాఫ్ట్
'అరవింద సమేత'పై కావాలని కుట్ర పన్నారా..?
తల్లి, కొడుకులు తిని కూర్చునే టైప్.. ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
మొదటి సారి సాయం కోరిన త్రివిక్రమ్!
అరవింద సమేత... బాహుబలి రికార్డులు బద్దలవుతాయ?
రెడ్డి ఇక్కడ సూడు.. సాంగ్ కోసం రెడీగా ఉండండి!