'సై రా' నుండి మరో సర్ప్రైజ్ లుక్..!

Published : Oct 09, 2018, 09:47 AM IST
'సై రా' నుండి మరో సర్ప్రైజ్ లుక్..!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమాకు సంబంధించిన టీజర్ ని చిరంజీవి పుట్టినరోజు కానుకగా విడుదల చేశారు. మెగాభిమానులను ఈ టీజర్ ఎంతగానో ఆకట్టుకుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గెటప్ లో చిరు లుక్ మెప్పించింది. 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమాకు సంబంధించిన టీజర్ ని చిరంజీవి పుట్టినరోజు కానుకగా విడుదల చేశారు. మెగాభిమానులను ఈ టీజర్ ఎంతగానో ఆకట్టుకుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గెటప్ లో చిరు లుక్ మెప్పించింది.

ఇప్పుడు సినిమా నుండి మరో కొత్త లుక్ ని విడుదల చేయడానికి సిద్ధమవుతుంది చిత్రబృందం. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో ఆయన ఎలా ఉండబోతున్నారనే విషయంపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది.

అమితాబ్ ఇది వరకే 'సై రా'లో తన గెటప్ ని తన బ్లాగ్ లో పోస్ట్ చేశారు. ఈ నెల 11న అమితాబ్ పుట్టినరోజు కానుకగా.. సై రా ఆయన లుక్ ని అఫీషియల్ గా విడుదల చేయనున్నార్. జనాలని తెలిసినప్పటికీ కాస్త కొత్తగా ఉండేలా చూసుకుంటున్నారు.

నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు రామ్ చరణ్. 

ఇవి కూడా చదవండి..

మెగాస్టార్ న్యూ లుక్ అదిరింది!

'సై రా' ఎనిమిది నిమిషాల కోసం.. రూ.54 కోట్లు!

 

PREV
click me!

Recommended Stories

ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా