#Adipurush:వావ్...ఇదే తెరమీదకు వస్తే అద్బుతమే

By Surya PrakashFirst Published Aug 29, 2022, 8:55 AM IST
Highlights

 ప్రభాస్ అభిమానులందరు ఈ పోస్టర్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ ఆర్ట్‌లో ప్రభాస్ ఉగ్రరూపంలో కనిపిస్తున్నాడు. ఓ పక్షి వంక కోపంగా చూస్తున్నాడు. 


హిందీలో 'తానాజీ' వంటి హిట్ సినిమా తీసిన ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా 'ఆదిపురుష్' (Adipurush Movie). సంక్రాంతి  రోజున అంటే జనవరి 12న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రోజున దేశంలో వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో షోలు వేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి వచ్చే ప్రతీ అప్డేట్ వారిని మురిపిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంభందించిన కాన్సెప్ట్ ఆర్ట్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు. artist Nimesh Shirsat ఈ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. 

ఈ పోస్టర్ అఫీషియల్ గా చేసిందా లేక ఫ్యాన్ మేడా అనేది ప్రక్కన పెడితే ప్రభాస్ అభిమానులందరు ఈ పోస్టర్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ ఆర్ట్‌లో ప్రభాస్ ఉగ్రరూపంలో కనిపిస్తున్నాడు. ఓ పక్షి వంక కోపంగా చూస్తున్నాడు. ఈ కాన్సెప్ట్ ఆర్టే వెండితెర మీదే ఆవిష్కరమైతే ‘ఆదిపురుష్’ రికార్డులను తిరగరాస్తుందని అభిమానులు భావిస్తున్నారు. వసూళ్ల సునామీని కురిపిస్తుందని పేర్కొంటున్నారు. 

రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' రూపొందుతోంది. ఇందులో ఆదిపురుషుడు శ్రీరామ చంద్రమూర్తి  పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. హిందూ సంస్కృతి, శ్రీరాముని గొప్పతనం గురించి వివరించే సినిమా కావడంతో పరోక్షంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అండ కూడా 'ఆదిపురుష్' కూడా ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. 

Concept Art of
By Nimesh Shirsat as Lord Rama
🔥🔥🏹🚩🚩💪💪🕉️ pic.twitter.com/f2hfGDVtD0

అలాగే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్‌కు అధికంగా ప్రాధాన్యం ఉండటంతో మేకర్స్ ఎక్కడ రాజీపడటం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ కోసం అధికంగా సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇదిలా ఉండగానే ‘ఆదిపురుష్’ డిజిటల్ రైట్స్ అత్యధిక ధరకు అమ్ముడయ్యాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మూవీకీ సంబంధించిన అన్ని భాషల డిజిటల్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని మీడియాలో వినిపిస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫాం రూ. 250కోట్లకు ఈ హక్కులను కొనుగోలు చేసిందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.
 

click me!