బిగ్ బాస్ షోపై నటి మాధవీలత ఫైర్!

By Udayavani DhuliFirst Published 3, Sep 2018, 10:46 AM IST
Highlights

బిగ్ బాస్ సీజన్2 మరికొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో హౌస్ మేట్స్ కి సరికొత్త టాస్క్ లను ఇస్తూ షోని రసవత్తరంగా సాగిస్తున్నారు బిగ్ బాస్

బిగ్ బాస్ సీజన్2 మరికొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో హౌస్ మేట్స్ కి సరికొత్త టాస్క్ లను ఇస్తూ షోని రసవత్తరంగా సాగిస్తున్నారు బిగ్ బాస్. అయితే గత కొన్నిరోజులుగా ఈ షోపై విమర్శలు వెల్లువెత్తాయి. 'మర్డర్ మిస్టరీ' టాస్క్ మొత్తం బిగ్ బాస్ తనకు  అనుకూలంగా నడిపించారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి.

దీనిపై నాని శనివారం ఎపిసోడ్ లో ప్రస్తావించారు కూడా. కౌశల్ ఎలిమినేట్ చేయడానికి ఇలా చేశారనే వ్యాఖ్యలను నాని కొట్టిపారేశారు. ఇక తాజాగా హౌస్ నుండి నూతన్ నాయుడుని ఎలిమినేట్ చేయడం కొందరికి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఓట్ల ప్రకారం హౌస్ నుండి గణేష్ తరువాత అమిత్ ఎలిమినేట్ కావాల్సివుంది. కానీ దీనికి భిన్నంగా నూతన్ బయటకి వెళ్లారు.

దీంతో నటి మాధవీలత బిగ్ బాస్ షోపై విమర్శలు చేసింది. ''అమిత్ కి తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ.. హౌస్ లో రీఎంట్రీలు ఎక్కువగా ఇచ్చాడనే కారణంతో నూతన్ నాయుడిని ఎలిమినేట్ చేశారు. బిగ్ బాస్ గేమ్ మొదలైంది. ఇప్పటినుండి మీ ఓట్లకు పెద్ద విలువ ఉండదు. ఇక నుండి షోని చూస్తూ ఉండండి చాలు'' అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. 

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2: ఎలిమినేషన్ ట్విస్ట్.. నూతన్ ఔట్!

బిగ్ బాస్2: నూతన్ నాయుడు ఎలిమినేట్ కానున్నాడా..?

బిగ్ బాస్2: సామాన్యుడు గణేష్ ఔట్!

'కౌశల్ ఆర్మీ'ని వాడుకుందామని కామెంట్స్ చేసిన గీతాపై నెటిజన్లు ట్రోలింగ్!

బిగ్ బాస్2: ఈ డ్రామాలేంటి..? బిగ్ బాస్ పై తనీష్ ఫైర్!

కౌశల్ కి ఉన్న ఏకైక అభిమాని నాని మాత్రమే.. బాబు గోగినేని కామెంట్స్!

Last Updated 9, Sep 2018, 12:46 PM IST