రైతులకు మద్దతుగా నిలిచిన నటికి, రేప్ చేస్తామంటూ బెదిరింపులు!

By team teluguFirst Published Feb 6, 2021, 1:36 PM IST
Highlights

బ్రిటీష్ నటి, హోస్ట్ మరియు రచయిత జమీలా జమీల్ రైతు ఉద్యమానికి మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్లు పెడుతున్నారు. అయితే రైతు పక్షాన నిలిచిన ఆమెకు బెదిరింపులు ఎక్కువయ్యాయట. కొందరు ఆమెను చెంపేస్తాం, మాన భంగం చేస్తాం అంటూ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె తెలియజేశారు.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ వేదికగా నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు రెండు నెలలుగా తమ నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ ఉద్యమంలో ఇప్పటికే కొంత మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వంతో రైతులు జరిపిన చర్చలు పలుమార్లు విఫలం కావడం జరిగింది. రైతుల నిరసనలకు మద్దతుగా కొందరు మాట్లాడుతుంటే.. కొందరు సెలెబ్రిటీలు ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారు. రైతు ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది . 


ఈ నేపథ్యంలో బ్రిటీష్ నటి, హోస్ట్ మరియు రచయిత జమీలా జమీల్ రైతు ఉద్యమానికి మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్లు పెడుతున్నారు. అయితే రైతు పక్షాన నిలిచిన ఆమెకు బెదిరింపులు ఎక్కువయ్యాయట. కొందరు ఆమెను చెంపేస్తాం, మాన భంగం చేస్తాం అంటూ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె తెలియజేశారు. జమీలా జమీల్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఈ విషయంపై సుదీర్ఘ సందేశం పంచుకున్నారు. 

''రైతు ఉద్యమానికి మద్దతుగా నిలిచినందుకు కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు. చంపేస్తాం, మానభంగం చేస్తాం అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ బెదిరింపులకు పాల్పడే వారు ఒక విషయం తెలుసుకోవాలి. నేను మనిషినే, ఒక దశ వరకే దేన్నైనా సహించగలను. అంతకు మందు రైతుల తరుపున పోరాడాను, ఇకపైన కూడా చేస్తాను. రైతులు తమ న్యాయపరమైన హక్కుల కోసం పోరాడుతున్నారు గుర్తించండి'' అంటూ ఆమె తెలియజేశారు.

click me!