చంద్రబాబు మీకు హిట్ ఇవ్వడు.. మీరు స్టేజి యాక్టరుకే పరిమితం

By Rekulapally SaichandFirst Published Nov 3, 2019, 1:06 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైకాపా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి   సంచలన కామెంట్స్ చేశారు. మీ నిర్మాత దర్శకుడు అయిన చంద్రబాబు మీకు హిట్ ఇవ్వడు.. మిమ్మల్ని స్టేజి యాక్టరుకే పరిమితం చేస్తాడు. కనుక కళ్లు తెరవండి. తెలుగుదేశం క్యాడర్‌కు జనసేన జెండాలు ఇచ్చి లాంగ్ మార్చి జరుపుతున్నారు.
ఇసుక కార్మికులను రెచ్చగొట్టవద్దు అంటూ పవన్‌పై విరుచుకుపడ్డారు.

విశాఖలో వైకాపా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు.  పవన్ కల్యాణ్ ఒక నటుడి స్థాయినుంచి రాజకీయనేత స్థాయికి ఎదగలేక పోయారంటూ విమర్శించారు. విలేకర్ల సమావేశంలో జంగా కృష్ణమూర్తి  మాట్లాడుతూ జగన్ విపక్షంలో ఉంటే ఆయన్ని విమర్శించారు.ఇపుడు జగన్ అధికారంలోకి వచ్చినా విమర్శిస్తున్నారు. 

దీన్ని బట్టే పవన్ ఎజెండా ఏమిటో, ఏజెండా నీడలో ఉన్నాడో జనానికి అర్ధమై పోయింది.ప్రకృతి సిద్ధమైన కారణాల వల్ల ఇసుక లభ్యత తగ్గితే దానికి ప్రభుత్వ వైఫల్యం కారణం అనటం ఎంత వరకూ సబబు? ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయి, అవుతున్నాయ"ని తెలిపారు

"సమాజంలోని ప్రతి వర్గానికీ మేలు జరిగింది. లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చారు‌ జీతాలు పెంచారు. వాటిలో ఒక్కదానికి నువు అభినందించావా? ఇపుడు ప్రభుత్వం చేతిలో లేని ఇసుక కొరత మీద ఉద్యమానికి దిగుతున్న పవన్ కల్యాణ్ చంద్రబాబు స్టేజి ఆర్టిస్టు కాదా? చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్న పవన్ కల్యాణ్ ఇకనైనా ఆత్మ విమర్శ చేసుకోవాలి.
వరద తగ్గగానే ఇసుక వస్తుంది. దోపిడీ నివారణకే ఈ ఇసుక విధానం ఏర్పడింది.
"

"మీ నిర్మాత దర్శకుడు అయిన చంద్రబాబు మీకు హిట్ ఇవ్వడు.. మిమ్మల్ని స్టేజి యాక్టరుకే పరిమితం చేస్తాడు. కనుక కళ్లు తెరవండి. తెలుగుదేశం క్యాడర్‌కు జనసేన జెండాలు ఇచ్చి లాంగ్ మార్చి జరుపుతున్నారు.ఇసుక కార్మికులను రెచ్చగొట్టవద్దు. కొరత తీరబోతోంది.భవన కార్మికుల్లో అత్యధికులు బీసీ ఎస్సీ ఎస్టీలే. వారికి ఇప్పటికే ఎన్నో పధకాలు ఉన్నాయి. అతి త్వరలోనే కావలసినంత ఇసుక వస్తుంది. 

అది తెలిసే చంద్రబాబు ఈ లోగా ప్రభుత్వాన్ని బద్నాం చేసి కార్మికుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఉడత ఊపులకీ , తాటాకు చప్పుళ్లకీ జగన్ ప్రభుత్వం భయపడదు. స్టేజి యాక్టరు ఈ విషయం గుర్తించి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలంటూ పవన్‌"పై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు.

click me!