కర్నూల్ జిల్లాలో మళ్లీ దేవాలయాలు మూత ... ఇవాళ రాత్రి నుండే

By Arun Kumar PFirst Published Jun 20, 2020, 10:21 AM IST
Highlights

సూర్యగ్రహణం కారణంగా కర్నూల్ జిల్లాలోని పలు ఆలయాలు మళ్లీ మూతపడనున్నాయి.  

కర్నూల్: సూర్యగ్రహణం కారణంగా కర్నూల్ జిల్లాలోని పలు ఆలయాలు మళ్లీ మూతపడనున్నాయి.  ఆదివారం సూర్యగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రముఖ ఆలయాలు శనివారం రాత్రే మూతపడనున్నాయి. 

జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు మహానంది, అహోబిలం, యాగంటి, ఓంకారం, కాల్వబుగ్గ, రుద్ర కోడూరు, వార్ల ఆలయ ద్వారాలు ఇవాళ నిత్యపూజలు ముగిసిన అనంతరం రాత్రి 10గంటలకు మూతపడనున్నాయి. తిరిగి ఆదివారం గ్రహణం పూర్తయిన తర్వాత ఆలయాల్లో సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. 

read more  సూర్యగ్రహణం... ఈ రాశులవారికి శుభ ఫలితాలు
 
దేవాలయాల్లో ప్రత్యక్ష సేవలే కాదు అన్ని పరోక్ష సేవలు నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సూర్య గ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయ ప్రధాన ఆలయమే కాదు ప్రాంగణంలోని పరివార ఆలయాలు కూడా మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 
 

click me!