విశాఖలో ఉద్రిక్తత... పోలీసుల భారీ బందోబస్తు

By Arun Kumar PFirst Published Oct 15, 2019, 3:15 PM IST
Highlights

విశాఖపట్నం జిల్లాలో ఉద్రిక్త  పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీస్ బలగాల భారీ బందోబస్తును చూస్తే ఎస్.రాయవరం మండలం నివురుగప్పిన నిప్పులా కనిపిస్తోంది. 

విశాఖపట్నం జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్. రాయవరం మండలంలోని బంగారమ్మపాలెంలో మత్స్యకారులు కదం తొక్కారు. దీంతో ఆందోళనలు చెలరేగకుండా వుండేందుకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు.

ఎన్ఏఓబి.వలన తమ జీవనాభృతి పోయిందనిదంటూ మత్యకారులు చేపట్టిన ధర్నా 5వ రోజుకు చేరుకుంది. జీ.ఓ.68ను తక్షణమే అమలుచేయాలుచేసి తమను ఆదుకోవాలంటూ మత్యకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ధర్నాకు దిగారు.

 గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తతలు చెలరేగకుండా నర్సీపట్నం ఏఎస్పి ఆధ్వర్యంలో బారీ బందోబస్తు  చేపట్టారు. ఐదుగురు సి.ఐలు, 20 మంది ఎస్ఐలు, 200 మంది పోలీసుల బలగాలను గ్రామంలో మోహరించారు. 

భారీ పోలీస్ బందోబస్తు కారణంగా గ్రామంలో ఏదో జరగబోతోందన్న ఆందోళన ప్రజల్లో మొదలైంది. దీంతో వారు ఇంట్లోంచి బయటకు రావడానికి  కూడా జంకుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ముందస్తు జాగ్రత్తల కోసమే బందోబస్తును ఏర్పాటుచేసినట్లు తెలిపారు. 

click me!