RTC Strike:తెలంగాణ బంద్... రెవెన్యూ ఉద్యోగులు ఎలా మద్దతిచ్చారంటే

By Arun Kumar PFirst Published Oct 19, 2019, 7:52 PM IST
Highlights

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టిసి కార్మికులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా సాగింది. ఈ బంద్ లొ ఆర్టిసి ఉద్యోగులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటే వివిధ ఉద్యోగ సంఘాలు పరోక్షంగా తమ మద్దతును తెలిపాయి. 

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఇటీవలే టీఎన్జీవో  ఎంప్లాయిస్ యూనియయస్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టిసి చేపట్టిన తెలంగాణ బంద్ కు తమవంతు సహకారం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న టీఎన్జీవోలంతా భోజ‌న విరామ స‌మ‌యంలో న‌ల్ల బ్యాడ్జీల‌ను ధ‌రించి బంద్‌లో పాల్గొన్నారు. 

ఈ క్రమంలో కరీంనగర్ పట్టణంలో విధులు చేపడుతున్న ఎన్జీవోలు భోజన విరామ సమయంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బైఠాయించి తమ నిరసన తెలిపారు. వీరంతా నల్ల బ్యాడ్జీలన ధరించి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో టిఏన్జీఓల కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మారం జగదీశ్వర్, కార్యదర్శి కాళిచరణ్ గౌడ్, కోశాధికారి వేముల రవీందర్,  కేంద్ర సంఘం నాయకులు సంగెం లక్ష్మణరావు, నాగుల నరసింహస్వామి, పెన్షనర్ సంఘం జిల్లా అధ్యక్షులు కేశవ్ రెడ్డి, ట్రేస్సా సంఘం నాయకులు రాజ్ కుమార్, శ్రవణ్ కుమార్, క్లాస్ ఫోర్ సంఘం అధ్యక్షులు రామస్వామిలు పాల్గొన్నారు.

అర్బన్ అధ్యక్షుడు సర్దార్ హర్మీందర్ సింగ్ కార్యదర్శి నేరేళ్ళ కిషన్,  రూరల్ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి, కార్యదర్శి రాజేష్ భరద్వాజ, తిమ్మాపుర్ అధ్యక్షుడు మామిడి రమేష్, కార్యదర్శి పోలు కిషన్, జిల్లా నాయకులు రవీందర్ రెడ్డి, దుర్గా రావు, అప్జలుద్దిన్, తిరుమల రావు, శారదా, శైలజ సబితా, శివాణి తదితరులు పాల్గొన్నారు.

ఇదేవిధంగా వరంగల్ జిల్లా కేంద్రంలో కూడా ఎన్జీవోల నిరసన కొనసాగింది. ఆర్టిసి స‌మ్మెకు  మ‌ద్ద‌తుగా తెలంగాణ రెవెన్యూ సంఘాల పిలుపు మేరకు ఉద్యోగులు సంఘీభావంగా బంద్‌లో పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని త‌హ‌శీల్దార్, ఆర్డీఓ, క‌లెక్ట‌ర్ కార్యాల‌యాల ముందు నిర‌స‌న తెలిపారు.

ఇలారాష్ట్ర వ్యాప్తంగా బంద్‌లో పాల్గొన్న రెవెన్యూ ఉద్యోగుల‌కు పేరుపేరున సంఘాల నాయ‌కులు కృతజ్ఞతలు తెలిపారు.  తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్‌ అధ్య‌క్షుడు వి.ల‌చ్చిరెడ్డి, తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్‌(టీజీటీఏ) అధ్య‌క్షుడు ఎస్‌.రాములు,  టి.వి.ఆర్‌.ఒ.డ‌బ్య్లూఏ రాష్ట్ర అధ్య‌క్షుడు గ‌రికె ఉపేంద్ర‌రావు,  ఏ టి.వి.ఆర్‌.ఒ.ఏ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మినారాయ‌ణ‌, టి.ఎస్‌.వి.ఆర్‌.ఏ రాష్ట్ర అధ్య‌క్షుడు  బాల‌న‌ర్స‌య్య‌, రాష్ట్ర, టి.ఎస్‌.వి.ఆర్‌.ఏ.బి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వంగూరు రాములు, టి.వి.ఆర్‌.ఒ.ఏ రాష్ట్ర, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సుదర్శన్ లు బంద్ లో పాల్గొన్న తమ సంఘాల ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.   

  

click me!