తాత్కాలిక సిబ్బంది నిర్వాకం... పెను ప్రమాదంలో ఆర్టిసి బస్సు

By Arun Kumar PFirst Published Oct 9, 2019, 3:14 PM IST
Highlights

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి వద్ద ఆర్టీసి బస్సు ప్రమాదానికి గురయ్యింది. అయితే ఈప్రమాదం నుండి ప్రయాణికులందరు సురక్షితంగా బయటపడ్డారు.   

నాగర్ కర్నూల్ జిల్లాలో ఆర్టీసి బస్సు ప్రమాదంలో చిక్కుకుంది. డ్రైవర్ అజాగ్రత్తతో ప్రయాణికులను తీసుకెళుతున్న బస్సు పొంగిపొర్లుతున్న వాగులోకి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదం నుండి ప్రయాణికులందరు సురక్షితంగా బయటపడ్డారు. 

 కల్వకుర్తి మండలంలోని  రఘుపతి పేట్ దుందుభి వాగు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దుందిబి వాగు పొంగిపొర్లుతుండటంతో తెల్కపల్లి కల్వకుర్తి మధ్య రాక పోకలు పూర్తిగా నిలిచి పోయాయి. దీన్ని పట్టించుకోకుండా ప్రయాణికుల ప్రాణాలను లెక్కచేయకుండా తాత్కాలిక ఆర్టీసి డ్రైవర్ ఆ ఉదృతిలోంచే బస్సును అవతలి వైపు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. 

అయితే నీటి ఉదృతిలోనే బస్సు నిలిచిపోయింది.  దీంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై బస్సులోంచి  ప్రయాణికులందరి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.దీంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు

తాత్కాలిక డ్రైవర్ కండక్టర్ లతో బస్సులను నడుపుతున్న ప్రభుత్వ హయాంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. సమ్మెలో వున్న   ఆర్టీసీ డ్రైవర్  దీనిపై స్పందిస్తూ ప్రభుత్వం పై మండి పడుతున్నారు.

click me!