వాల్మీకి జయంతి ఇక రాష్ట్ర పండుగ: అనంతలో వేడుకలు

By Siva KodatiFirst Published Oct 7, 2019, 5:46 PM IST
Highlights

మహర్షి వాల్మీకి జయంతిని రాష్టర పండుగగా నిర్వహించాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. వాల్మీకి మహార్షి జయంతి సందర్భంగా ఈ నెల 13న అనంతపురం జిల్లాలో జరిగే వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది

మహర్షి వాల్మీకి జయంతిని రాష్టర పండుగగా నిర్వహించాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. వాల్మీకి మహార్షి జయంతి సందర్భంగా ఈ నెల 13న అనంతపురం జిల్లాలో జరిగే వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది.

అలాగే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వాల్మీకి జయంతి వేడుకల నిర్వహణకు ప్రభుత్వం రూ.25 లక్షల నిధులను విడుదల చేసింది.

అలాగే ప్రతి ఏటా అశ్వీయుజ పౌర్ణమి రోజున వాల్మీకి జయంతి వేడుకలను నిర్వహించాలని ఉత్తర్వుల్లో తెలిపింది. రూ.25 లక్షల నిధుల్లో అనంతపురం జిల్లాకు రూ.6 లక్షలు.. మిగిలిన 12 జిల్లాలకు లక్షన్నర చొప్పున కేటాయించింది.

కాగా 2017లోనే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.  అన్ని జిల్లా కేంద్రాల్లో మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించాలని, రాష్ట్ర స్థాయిలో వేడుకల నిర్వహణను బీసీ సంక్షేమ శాఖ పర్యవేక్షించాలని తెలిపింది. 

click me!