''మూడు రాజధానులు వద్దు-అమరావతే ముద్దు'': కర్నూల్ టిడిపి నేతల వినూత్న నిరసన

By Arun Kumar PFirst Published Jan 20, 2020, 6:03 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ కు మూడు రాజధానులు ఏర్పాటుచేయాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్నూల్ జిల్లా టిడిపి నాయకులు వినూత్న పద్దతిలో నిరసన తెలిపారు. 

కర్నూల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని కర్నూలు జిల్లా టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ''మూడు రాజధానులు వద్దు- అమరావతి ముద్దు'' అంటూ పెద్ద ఎత్తున నినదించారు. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు నల్లబ్యాడ్జీలు ధరించి, నల్ల బెలూన్లతో పాటు నల్ల పావురం ఎగరవేసి తమ నిరసనను తెలిపారు. 

ఒకవేళ అమరావతి నుండి రాజధానిని తరలిస్తే విశాఖకు కాకుండా గతంలో రాజధానిని త్యాగం చేసిన కర్నూలుకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు... టీడీపీ అధినేత చంద్రబాబును దెబ్బకొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని మండి పడ్డారు.

read more  అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు... కర్నూలులో న్యాయవాదుల సంబరాలు

రాజధానిని కోల్పోయిన కర్నూలుపైనా, రాయలసీమపై కనికరం లేకుండా సీఎం జగన్ ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హై కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూనే రాజధానిని కూడా కర్నూల్ లోనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన రాయలసీమ ప్రజలకు కర్నూలు జిల్లా వాసులకు పెద్దగా ఒనగూరే ప్రయోజనం లేదంటూ పెదవి విరిచారు. 

ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే ముందు ముందు మరిన్ని ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రాజధాని అమరావతి భూములు ఇచ్చిన రైతుల దుస్థితి చూస్తుంటే బాధ కలుగుతోంది వారు ఆవేదన వ్యక్తం చేశారు. 


  

click me!