ప్రాజెక్ట్ నీటిపై మాటల యుద్ధం: కర్నూలు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వివాదం

By Siva KodatiFirst Published Sep 26, 2019, 3:53 PM IST
Highlights

కర్నూలు జిల్లా అధికార పార్టీలో అంతర్యుద్ధం సాగుతోంది. ప్రాజెక్ట్ నీటి కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. 

కర్నూలు జిల్లా అధికార పార్టీలో అంతర్యుద్ధం సాగుతోంది. ప్రాజెక్ట్ నీటి కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు

కొద్దిరోజుల క్రితం కోడుమూరు ఎమ్మెల్యే సుధాకార్ గాజులదిన్నె ప్రాజెక్ట్‌ను సందర్శించి అక్కడి అధికారులు లంచాలకు ప్రాజెక్ట్ నీటిని రైతులకు అమ్మకుంటున్నారంటూ ఆరోపించారు. తద్వారా ఇప్పటి వరకు ఏకంగా రెండు కోట్ల రూపాయలు సంపాదించారని సుధాకర్ భగ్గుమన్నారు.

దీనిపై ఉద్యోగ సంఘాలు ధీటుగా స్పందించాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ సుధాకర్ వ్యాఖ్యలకు మరో అధికార పార్టీ నేత, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కొత్తకోట చెన్నకేశవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధాకర్ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు.

తమ రైతులకు రెండు కోట్ల రూపాయల లంచాలు ఇచ్చి నీటిని వాడుకునేంత స్తోమత లేదని విమర్శించారు. తమ ప్రాంత రైతులను చూసి ఓర్వలేక ఇలా ఆరోపణలు చేస్తున్నారంటూ చెన్నకేశవరెడ్డి మండిపడ్డారు.

ఇటువంటి ఆరోపణలతో సుధాకర్ తమ ప్రాంత రైతుల హక్కులను కలరాస్తున్నారని ఆయన ఎద్దేశా చేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని రైతుల శ్రేయస్సు కోసం 3 టీఎంసీల నీరు కేటాయించి ఆదుకోవాలని చెన్నకేశవరెడ్డి అధికారులను డిమాండ్ చేశారు.

అయితే ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య ముదురుతున్న మాటల యుద్ధం ఎటువైపుకు దారితీస్తుందోనని వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. పరిస్ధితి అక్కడివరకు వెళ్లకుండానే ఇద్దరు నేతల మధ్య వివాదానికి తెరదించాలని క్యాడర్ కోరుతోంది. 

click me!