విశాఖలో ఘనంగా నేవీ డే సెలబ్రేషన్స్... సముద్రంలో అద్భుత విన్యాసాలు

By Arun Kumar PFirst Published Dec 4, 2019, 9:36 PM IST
Highlights

విశాఖపట్నంలో నేవీ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.  

విశాఖపట్నం: భారత వైమానిక దళ ధినోత్సవ వేడుకలు ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖ నగరంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ  సందర్భంగా సముద్ర తీరంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నావికాదళ సైనికులు సముద్రంలో చేపట్టిన సాహసోపేత విన్యాసాలు కార్యక్రమానికి విచ్చేసిన వారికి అమితంగా ఆకట్టుకున్నాయి. 

ఈ కార్యక్రమం కోసం విశాఖకు చేరుకున్న ముఖ్యమంత్రికి తూర్పు నావికాదళం వైస్ ఆడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ దంపతులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం నేవీకి సంబంధించి వీడియోలను ముఖ్యమంత్రి తిలకించారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మరియు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బివి సత్యవతి, జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ దంపతులు, నగర పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా, ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు పాల్గొన్నారు.

read more  ఛాన్స్ కొట్టేశారు: వైసీపీలో భారీగా నామినేటెడ్ పదవులు

అలాగే ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, గుడివాడ అమర్ నాథ్, తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీతో పాటు ప్రజా ప్రతినిధులు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్ శివ శంకర్, జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి సృజన, విఎంఆర్డిఏ కమిషనర్ కోటేశ్వరరావు, ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్  ప్రసాద రెడ్డి పోర్ట్ చైర్మన్  కె. రామ్మోహన్, డిఆర్ఎం  చేతన్ కుమార్ శ్రీ వాస్తవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం కోసం విశాఖకు చేరుకున్న జగన్ ను ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు కలిశారు. ఉగాది కల్లా జర్నలిస్టులందరికీ ఇళ్లు, ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. ఇటీవల అక్రిడేషన్ లకు సంబంధించి విడుదల చేసిన జీవో నెంబర్ 144 ను సవరించాలని కోరారు. తాజా నిబంధన కారణంగా చిన్న పత్రికలతో పాటు వాటిపై ఆధారపడి జీవిస్తున్న విలేకర్ల జీవనం  కూడా ఇబ్బందికరంగా తయారవుతుందని ముఖ్యమంత్రికి వివరించారు.

read more  ఆ కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించండి...: కలెక్టర్లకు మంత్రి పెద్దిరెడ్డి ఆదేశం

అదే సమయంలో విశాఖ తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విశాఖ నగర అధ్యక్షుడు రాంచందర్రావు సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

 జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు జీవో నెంబర్ 144 ద్వారా చిన్న పత్రికలకు విలేకర్లకు ఏ రకంగా నష్టం జరుగుతుందో అన్న వివరాలను కూడా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. విశాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న 2005 జర్నలిస్టుల సంఘంకు అప్పగించిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పై ముఖ్యమంత్రి చర్య తీసుకోవాలని కూడా వినతి పత్రంలో పేర్కొన్నారు. దీని పై అధికారుల ద్వారా తగు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

click me!