మూడు లక్షల కరెన్సీ తో అమ్మవారి అలంకరణ (వీడియో)

By Arun Kumar PFirst Published Oct 5, 2019, 1:22 PM IST
Highlights

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని కరెన్సీతో అలంకరించి తమ భక్తిని చాటుకున్నారు కర్నూల్ జిల్లా నంద్యాలవాసులు.   

సర్వ లోకాలను పాలించే ఆ దేవతామూర్తులు తమను అనుగ్రహించమని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కోరుకుంటారు. మరి కొందరు వినూత్న ఆలోచన తో అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక పూజలు సైతం నిర్వహిస్తుంటారు. అలాగే ఇంకొందరు అమ్మవారిని విభిన్నంగా అలంకరించుకుని  తమ భక్తిని చాటుకుంటారు. ఎవరు ఏ రకంగా కొలిచినా పిలిచిన ఆ అమ్మలగన్న అమ్మ మాత్రం అందరికీ చల్లని దీవెనలు ఇస్తుంది. 

నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు ప్రతిరోజు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. ఆ అమ్మవారికి మరింత ప్రత్యేకంగా కనిపించేలా అలంకరించారు కర్నూలు జిల్లాలోని నంద్యాలవాసులు.  ఆలోచన రావడమే తడవుగా దానిని అమలు చేశారు. దీంతో అమ్మవారు మరింత శోభతో  భక్తులకు దర్శనమిస్తున్నారు.

కర్నూలు జిల్లా నంద్యాల లోని బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణమండపంలో వినూత్న రీతిలో అమ్మవారికి కరెన్సీ నోట్లతో అలంకరించారు. ధనలక్ష్మి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చేందుకు గాను కరెన్సీ నోట్లతో అలంకరించినట్లు బాలాజీ కాంప్లెక్స్ కమిటీ నిర్వాహకులు వెల్లడించారు.


"మూడు లక్షల కరెన్సీ తో వరలక్ష్మి అమ్మవారు అలంకరణ" 

నేడు ఆశ్వయుజ శుద్ధ షష్టి కావడంతో కరెన్సీ నోట్లతో శ్రీ ధనలక్ష్మి అమ్మవారికి అలంకారం చేసినట్లు తెలిపారు. సుమారు 3లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ జరిగిందన్నారు. ఈ అలంకరణ కోసం  2000, 500, 200, 100, 50,10 రూపాయల నోట్లను కూడా ఉపయోగించామని నిర్వాహకులు తెలిపారు.  ప్రత్యేకంగా ముస్తాబయిన అమ్మలగన్న అమ్మకు ప్రత్యేక పూజలు చేసేందుకు...దర్శించుకునేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. 

పర్యావరణ పరిరక్షణ తమ ధ్యేయం... ఉత్సవ కమిటీ నిర్వాహకులు 

ప్రతి ఏడాది దసరా నవరాత్రుల్లో పర్యావరణానికి హానీ చేయకుండానే అమ్మవారిని అలకరిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఇలా గత 20 సంవత్సరాల నుంచి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామనీ... ఈ సంవత్సరం మరింత ప్రత్యేకంగా వుండేందుకే దాదాపు మూడు లక్షల రూపాయలు కరెన్సీ నోట్లతో అమ్మవారు అలంకరించామన్నారు.   

సంబంధిత వీడియో

click me!