అనంతపురంలో ట్రాక్టర్ బోల్తా: నలుగురు మృతి, మరో ఇద్దరికి గాయాలు

Published : Sep 25, 2019, 10:05 AM ISTUpdated : Sep 25, 2019, 10:08 AM IST
అనంతపురంలో ట్రాక్టర్ బోల్తా: నలుగురు మృతి, మరో ఇద్దరికి గాయాలు

సారాంశం

అనంతపురం జిల్లాలో బుధవారం నాడు ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 

అనంతపురం: అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో బుధవారం నాడు ఉదయం ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో  నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

అనంతపురం జిల్లా నంబులపూలకుంటలోని సోలార్ పవర్ ప్లాంట్‌లో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

మృతులంతా ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారిగా స్థానికులు చెబుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?