బోటు మునక: 12 మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

By narsimha lodeFirst Published Sep 15, 2019, 3:50 PM IST
Highlights

తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం కచలూరు సమీపంలో బోటు మునిగిన ఘటనలో 7 మృతదేహలు వెలికితీశారు. 

దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం-కచలూరు ప్రాంతంలో బోటు మునిగిన ఘటనలో 12 మృతదేహాలను వెలికితీశారు. ఆచూకీ గల్లంతైన వారి కోసం  గాలింపు చేపట్టారు.

పోలవరం మండలం సింగన్నకొండ నుండి పాపికొండలను చూసేందుకు వెళ్తున్న రాయల్ పున్నమి బోటు కచలూరు సమీపంలో మునిగిపోయింది.ఈ బోటులో 61 మంది ప్రయాణం చేస్తున్నట్టుగా గుర్తించారు. 50 మంది పర్యాటకులైతే, మరో 11 మంది సిబ్బందిగా గుర్తించారు.

బోటు ప్రమాదం చోటు చేసుకొన్న సమయంలో  లైఫ్ జాకెట్లు వేసుకొన్న 17 మందిని తూటుగుంట గ్రామస్తులు రక్షించారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఐదు మృతదేహలను గోదావరి నుండి వెలికితీశారు. లైప్ జాకెట్లు వేసుకోని వారు ఈ ప్రమాదంలో గోదావరి లో కొట్టుకుపోయే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

"

సంబంధిత వార్తలు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

click me!