తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం-కచలూరు సమీపంలో ఆదివారం నాడు బోటు మునిగిన ప్రాంతంలో గతంలో రెండు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి.
రాజమండ్రి: దేవీపట్నం-కచ్చలూరు ప్రాంతంలో రాయల్ పున్నమి బోటు ఆదివారం నాడు బోల్తా పడింది. గతంలో ఇదే ప్రాంతంలో రెండు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. ఈ రెండు ప్రమాదాల్లో కూడ పెద్ద ఎత్తున .ప్రాణ నష్టం చోటు చేసుకొంది.
పాపికొండలను చూసేందుకు 61 మంది ప్రయాణీకులు రాయల్ పున్నమి బోటులో ఆదివారం నాడు బోటులో ప్రయాణాన్ని ప్రారంభించారు. గండి పోచమ్మ ఆలయం నుండి కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకొంది.
కచ్చలూరు ప్రాంతంలో 80 అడుగుల లోతు ఉంటుంది. ఈ ప్రాంతంలో గోదావరి నది సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. 1964లో కచ్చలూరులో ఉదయ్ భాస్కర్ అనే బోటు మునిగింది. ఈ ఘటనలో 60 మంది మృతి చెందారు. ఈ ఘటన తర్వాత ఝాన్సీరాణి అనే బోటు మునిగి 8 మంది మృతి చెందారు. ఈ రెండు ప్రమాదాలు కచ్చలూరులోనే చోటు చేసుకొన్నాయి.
ఆదివారం నాడు కూడ కచ్చలూరు ప్రాంతంలోనే బోటు ప్రమాదానికి గురైంది. ప్రమాదం చోటు చేసుకొన్న సమయంలో బోటులో 61 మంది ఉన్నారని సమాచారం. బోటులో లైఫ్ జాకెట్లు వేసుకొన్న వారు బయట పడినట్టుగా సమాచారం..
సంబంధిత వార్తలు
పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం
తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు