విత్తనాల కోసం రోడ్డెక్కిన కర్నూల్ రైతన్నలు...

By Arun Kumar PFirst Published Oct 11, 2019, 8:21 PM IST
Highlights

వర్షాలు సమృద్దిగడా కురుస్తున్నా కర్నూల్ రైతులు రబీ పంటను సాగుచేయలేని పరిస్థితి నెలకొంది. తమ సమస్య పరిష్కారం కోసం రైతన్నలు ఏకంగా రోడ్డుపైనే బైటాయించి నిరసన తెలిపారు.  

కర్నూలు జిల్లాలో విత్తనాల కోసం అన్నదాతలు మళ్ళీ రోడ్డు బాట పట్టారు. ప్రభుత్వ అధికారులు విత్తనాలు సరఫరా చేయడంలో చూపిస్తున్న జాప్యంతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెడుతూ నిరసనలు చేపడుతున్నారు. 

రబీసాగుకు  సిద్దమవుతున్న రైతులకు రోజూ కురుస్తున్న వర్షాలు ఆనందాన్ని ని0పుతున్నాయి. అయితే సాగుకు అవసరమైన విత్తనాలు సకాలంలో అందక వారు ఆందోళనలకు దిగుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు మాత్రం రైతుల ఇబ్బందులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. 

కర్నూలుజిల్లా ఆలూరులో పప్పు శనగ పంటను సాగుచేసే రైతులు విత్తనాలను పంపిణీచేయాలని ఏకంగా ధర్నాకు దిగారు. కర్నూలు- బళ్లారి ప్రధాన రహదారిపై వాహనాలను నిలిపి ధర్నా చేపట్టారు. వ్యవసాయశాఖ సిబ్బంది రైతుల ఆందోళనను పట్టించుకోకుండా నో స్టాక్ బోర్డు పెట్టి వ్యవసాయ కార్యాలయంలో అందుబాటులో లేకుండా పోయారు. 

వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యం తో రైతుల ఆందోళన మరింత ఉదృతం అయింది.పోలీసులు అక్కడికిచేరుకుని రైతులతో మాట్లాడి నిరసనను విరమింపజేశారు. 

వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో పప్పు శనగ పంటను దాదాపు ఒక లక్ష 20 వేలఎకరాలలో రైతులు సాగుచేస్తున్నామన్నారు.అందుకు 30 వేల టన్నుల కుపైగా  విత్తనాలు అవసరం. అయితే వ్యవసాయశాఖ అధికారులు సాగుకు సరిపడే విత్తనాలను అందుబాటులో ఉంచడం లేదని రైతుల ఆరోపించారు.

ఇప్పటివరకు కేవలం 15,480 టన్నుల విత్తనాలు ఆయా మండలాలకు వచ్చాయని పోలీసులకు వివరించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుడడంతో సాగుకు సిద్ధమవుతున్న  వ్యవసాయ సిబ్బంది ఇంకా సాగుకు సమయం ఉందని విత్తనాలను వ్యవసాయ కార్యాలయంలో స్టాక్ పెట్టడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

click me!