''2024 నాటికి వినికిడి సమస్య లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్''

By Arun Kumar PFirst Published Oct 10, 2019, 5:27 PM IST
Highlights

2024నాటికి ఆంధ్ర ప్రదేశ్ లో వినికిడి లోపంలేకుండా చేస్తామని దీన్ దయాల్ శ్రావణ్ ఫౌండేషన్ స్పష్టం చేసింది.  

విజయవాడ:  2024 సవత్సరంలోపే వినికిడి సమస్య లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చి దిద్దుతామని దీన్ దయల్  శ్రావణ ఫౌండేషన్ ప్రకటించింది.  విజయవాడలోని ఓ హోటల్లో ఈ ఫౌండేషన్ చైర్మన్ రేగుల రామాంజనేయులు మీడియా సమావేశం నిర్వహించి తమ భవిష్యత్ కార్యాచరణ గురించి ప్రకటించారు. 

దీన్ దయాల్ రిలీఫ్ ఫండ్ ద్వారా వినికిడి(చెవిటి) సమస్య వున్నవారికి ఉచిత వినికిడి మిషన్లు అందజేశారు. అలాగే మొత్తం రూ.96 వేల రూపాయలను 9 మందికి అందజేశారు. 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి నాయకులు,మాజీ ఆదాయపన్ను కమీషనర్ చింతల పార్థసారథి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సంస్థ ద్వారా గత రెండు సంవత్సరాలుగా ఐదు వెలమందికి పైగా వినికిడి సమస్య ఉన్నవారికి మిషన్లు పంపిణీ  చేశామన్నారు. 2024 నాటికీ పూర్తిగా వినికిడి సమస్య లేని రాష్ట్రంగా చేయటమే మాముందున్న ప్రధాన లక్ష్యమని రామాంజనేయులు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జాతీయ మైనార్టీ మోర్చా కార్యదర్శి షేక్ బాజి ,మీడియా కన్వీనర్ గంగాధర్,షేక్ ఖాజా అలీ తదితరులు పాల్గొన్నారు. 

click me!