ఆయన మంగళవారం సీఎం అని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు: టీడీపీ ఎమ్మెల్సీ

By Rekulapally SaichandFirst Published Nov 10, 2019, 6:19 PM IST
Highlights

ఏపీఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ-వైసీపీ నేతల మధ్య మొదలైన ట్వీట్ల వార్ కోనసాగుతునే ఉంది. వైసీపీ నేతలు ట్వీట్స్ కు  టీడీపీ నేతల కౌంటర్లు.. మళ్లీ తిరిగి కౌంటర్ ఎటాక్ చేయడం సర్వ సాధరణం అయిపోయింది. వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డిని బుద్ద వెంకన్న, నారా లోకేశ్‌లు వరస ట్వీట్‌లతో ఆటాక్ చేస్తున్నారు.


ట్విట్టర్ లో టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైసీపీపై విరుచుకుపడ్డారు. "ఇప్పటి వరకూ మేము శుక్రవారం ముఖ్యమంత్రి అనుకున్నాం కానీ మీరే స్వయంగా ఆయన మంగళవారం ముఖ్యమంత్రి అని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. హామీలు నెరవేర్చే దమ్ము లేక "రాష్ట్రం అప్పుల్లో ఉంది" అంటూ దద్దమ్మ కబుర్లు ఎందుకు విజయసాయి రెడ్డి" అంటూ ట్విటర్ పోస్టు పెట్టారు. 

అలాగే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని వివరిస్తూ మరో ట్వీట్ చేశారు. "చంద్రబాబు గారి హయాంలో చేసిన అప్పు 1,10,000 కోట్లు అంటే ఏడాదికి 22 వేల కోట్లు. ఐదు నెలల మీ జగన్ గారి పాలనలో చేసినవి 18 వేల కోట్లు. పైగా 2019-2020 బడ్జెట్లో సంవత్సరానికి 48 వేల కోట్ల అప్పులు ప్రతిపాదించారు.ఇప్పుడు చెప్పండి లెక్కల మాస్టారు.. ఎవరు ఎక్కువ అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేస్తున్నారు. మీ దొంగ మొహాలు చూసి బ్యాంకులు ఛీ అంటున్నా, నవ్వి పోదురు గాక నాకేంటి సిగ్గు నేను రాసిన తప్పుడు లెక్కే నిజం అంటారా విజయసాయిరెడ్డి గారు?"అంటూ విజయసాయి రెడ్డి తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. 

ఏపీఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ-వైసీపీ నేతల మధ్య మొదలైన ట్వీట్ల వార్ కోనసాగుతునే ఉంది. వైసీపీ నేతలు ట్వీట్స్ కు  టీడీపీ నేతల కౌంటర్లు.. మళ్లీ తిరిగి కౌంటర్ ఎటాక్ చేయడం సర్వ సాధరణం అయిపోయింది. వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డిని బుద్ద వెంకన్న, నారా లోకేశ్‌లు వరస ట్వీట్‌లతో ఆటాక్ చేస్తున్నారు.దీనికి విజయసాయి రెడ్డిని రివర్స్ ఆటాక్ చేస్తూ ఏమాత్రం తగ్గడం లేదు.

తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి సంచలన ట్వీట్స్ చేశారు. బుద్దా చేసిన ఈ ట్వీట్స్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి

click me!