కరోనా ని జయించిన నాలుగు నెలల చిన్నారి

By telugu news teamFirst Published Jun 13, 2020, 2:15 PM IST
Highlights

నాలుగు నెలల బాలుడు..18 రోజుల పాటు స్థానిక విమ్స్ ఆసుపత్రిలో కోవిడ్  19 చికిత్స పొంది కోలుకున్న అనంతరం ఈరోజు డిశ్చార్జి అయ్యాడని జిల్లా కలెక్టర్  వి.వినయ్ చంద్ తెలిపారు. 
 

కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. కేసులు కూడా రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.కాగా.. ఈ వైరస్ బారిన పడిన ఓ నాలుగు నెలల చిన్నారి దానిని జయించాడు. దాదాపు 18 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన చిన్నారి.. ఎట్టకేలకు దానిని జయించాడు. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నాలుగు నెలల బాలుడు..18 రోజుల పాటు స్థానిక విమ్స్ ఆసుపత్రిలో కోవిడ్  19 చికిత్స పొంది కోలుకున్న అనంతరం ఈరోజు డిశ్చార్జి అయ్యాడని జిల్లా కలెక్టర్  వి.వినయ్ చంద్ తెలిపారు. 

తూర్పు గోదావరి జిల్లా గిరిజన ప్రాంతానికి చెందిన టి. లక్ష్మి (తల్లి),  కుమారుడికి  (4 నెలలు) కోవిడ్ 19 సోకింది.  అక్కడ నుండి వెంటిలేటర్ పై క్రిటికల్‌ కండిషన్ లో  మే 25 వ తేదీన స్థానిక  విమ్స్  ఆసుపత్రి లో  ఎడ్మిట్ అయిన తదుపరి   ట్రీట్ మెంటు యివ్వడం జరిగింది. 

18 రోజుల పాటు ట్రిట్ మెంటు  యిచ్చి న తదుపరి బాలుడు పూర్తిగా కోలుకున్నాడని నిర్ధారణ అయిన పిదప ఈ రోజు విమ్స్ డాక్టర్లు  డిశ్చార్జి గావించారని తెలిపారు. అంత చిన్న వయసు బాలుని కి మంచి వైద్యం అందించి కోవిడ్ - 19 నుండి కోలుకు నేలా కృషి చేసిన వైధ్యుల ను జిల్లా కలక్టరు అభినందించారు.

click me!