T20 worldcup:ఆదివారం మ్యాచ్ ఎలా ఉంటుందో చూడాలి.. విరాట్ కోహ్లీ

By telugu news teamFirst Published Nov 6, 2021, 12:18 PM IST
Highlights

గ్రూప్ 2 లో అత్యధిక రన్ రేట్ కలిగిన జట్టుగా నిలిచింది. ఇక ఆదివారం ఆప్గానిస్తాన్ జట్టు న్యూజిలాండ్ ను ఓడించడమే మిగిలింది. అదే జరిగితే భారత్ సెమీస్ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ విజయంపై మాట్లాడిన కోహ్లీ ఇలాంటి ప్రదర్శన కోసమే తాము ఎదురుచూస్తున్నామని చెప్పాడు.
 

T20 Worldcup లో టీమిండియాకు సెమీ ఫైనల్ కే చేరే అవకశాలు మరింత పెరిగాయి. శుక్రవారం.. స్కాట్లాండ్ ని టీమిండియా చిత్తుచిత్తుగా ఓడించిన సంగతి తెలిసందే. దాదాపు 8 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ప్రత్యర్థిని 85 పరుగులకే కట్టడి చేసిన కోహ్లీ సేన.. ఛేదనలో రెండు వికెట్లు కోల్పోయి.. 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.

Also Read: తమ రిలేషన్ ని కన్ఫామ్ చేసిన కేఎల్ రాహుల్, అతియా శెట్టి..!

దీంతో గ్రూప్ 2 లో అత్యధిక రన్ రేట్ కలిగిన జట్టుగా నిలిచింది. ఇక ఆదివారం ఆప్గానిస్తాన్ జట్టు న్యూజిలాండ్ ను ఓడించడమే మిగిలింది. అదే జరిగితే భారత్ సెమీస్ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ విజయంపై మాట్లాడిన కోహ్లీ ఇలాంటి ప్రదర్శన కోసమే తాము ఎదురుచూస్తున్నామని చెప్పాడు.

స్కాట్లాండ్ తో మ్యాచ్ లో తాము సంపూర్ణ మద్దతు సాధించామని.. మరోసారి కూడా ఇలాంటి ప్రదర్శనే చేయాలని అనుకుంటున్నామని కోహ్లీ పేర్కొన్నాడు. ఇక ఆదివారం ఏ  జరుగుతుందనేది ఆసక్తిగా మారిందన్నాడు. ఆ మ్యాచ్ ఎలా సాగుతుందో చూడాలని కోహ్లీ పేర్కొన్నాడు. ఈ రోజు ఆట గురించి పెద్దగా చెప్పాలని లేదన్నాడు. తాము ఏం చేయగలమో తమకు తెలుసన్నాడు.

Also Read: Virat Kohli Birthday : క్యాండిల్ ఊదడం మర్చిపోయి కేక్ కట్ చేసిన కోహ్లీ.. వీడియో వైరల్..!

అలాగే ఈ వేదికపై టాస్ ఎంత కీలకమో కూడా తెలిసిందన్నాడు. స్కాట్లాండ్ ను 110 లేదా 120 లోపు కట్టడి చేయాలనుకున్నామన్నాడు. బౌలర్లు బాగా ఆడారన్నాడు. రాహుల్ కూడా బాగా ఆడారన్నాడు. ఇక ఛేదనలో తాము 810 ఓవర్ల మధ్య లక్ష్యాన్ని పూర్తి చేయాలని చూశామన్నాడు. రోహిత్, రాహుల్ నిలకడగా ఆడితే పరుగులు వాటంతట అవే వస్తాయని అనుకున్నామన్నారు.

Also Read: T20 Worldcup 2021: దంచికొట్టిన భారత బ్యాట్స్‌మెన్... దుమ్మురేపిన టీమిండియా...

ప్రాక్టీస్ మ్యాచ్ లోనూ ఇలానే ఆడామన్నాడు. తమ సహజమైన ఆట ఇలానే ఉంటుందన్నాడు. అయితే.. పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్ ల్లోనే అది కుదరలేదని.. ఆ రెండు జట్లు బౌలింగ్ అద్భుతంగా చేసి తమను ఒత్తిడిలోకి నెట్టాడన్నాడు.

Also Read: రెండు చేతులతో చేయాల్సినదాన్ని ఒక్కచేత్తో చేస్తే... రిషబ్ పంత్‌పై ఊర్విశి క్రేజీ పోస్ట్...

click me!