T20 Worldcup: ఆ రెండు మ్యాచ్ లతో టీమిండియాను జడ్జ్ చేయలేం.. జడేజా

By telugu news teamFirst Published Nov 6, 2021, 10:58 AM IST
Highlights

ఓడిపోయిన రెండు మ్యాచ్ లను చూసి టీమిండియా జడ్జ్ చేయలేరని  టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పేర్కొన్నారు. శుక్రవారం స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించిన తర్వాత.. రవీంద్ర జడేజా మాట్లాడారు.

T20 worldcup లో టీమిండియా తొలుత తడపడినా.. మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది.  ఇప్పటివరకు టీమిండియా నాలుగు మ్యాచులు ఆడగా.. వాటిలో రెండు కీలక మ్యాచులలో ఓటమిపాలైంది. తర్వాత ఆప్ఘానిస్తాన్ తో తొలి విజయం అందుకున్న టీమిండియా... అదే జోష్ ని కొనసాగిస్తోంది.  శుక్రవారం స్కాట్లాండ్ తో.. టీమిండియా తలపడింది. ఈ మ్యాచ్ లో స్కాట్లాండ్ ని టీమిండియా చిత్తు చిత్తుగా ఓడించింది.

Also Read: Virat Kohli Birthday : క్యాండిల్ ఊదడం మర్చిపోయి కేక్ కట్ చేసిన కోహ్లీ.. వీడియో వైరల్..!

కాగా.. ఓడిపోయిన రెండు మ్యాచ్ లను చూసి టీమిండియా జడ్జ్ చేయలేరని  టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పేర్కొన్నారు. శుక్రవారం స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించిన తర్వాత.. రవీంద్ర జడేజా మాట్లాడారు. మొదటి రెండు మ్యాచ్ లు ఓడిపోయినంత మాత్రామా ఏమీ కాలేదని జడేజా అన్నారు. భారత్ ఇంకా దక్కాల్సిన గౌరవం ఉందని ఆయన పేర్కొన్నాడు.

INNINGS BREAK!

Sensational bowling display from ! 🔥 🔥

3⃣ wickets each for &
2⃣ wickets for
1⃣ wicket for

Scorecard ▶️ https://t.co/cAzmUe5OJM pic.twitter.com/hCVdTINaqF

— BCCI (@BCCI)

టీమిండియా.. 2007లో టీ20 వరల్డ్ కప్ టైటిల్ ని సొంతం చేసుకుంది. అయితే..  ఈ సారి వరల్డ్ కప్ లో మాత్రం.. గ్రూప్ లో మొదటి రెండు జట్లైన పాకిస్తాన్, న్యూజిలాండ్  చేతిలో చిత్తుగా ఓడింది.  దీంతో...టీమిండియా త్వరగా నిష్క్రమించే ప్రమాదం ఉందని అందరూ అనుకున్నారు. వరసగా రెండు మ్యాచులు పరాజయం చెందడంతో.. జట్టు పరిస్థితి అయోమయంలో పడింది. అయితే.. టీమిండియా కోలుకొని..  రెండు మ్యాచుల్లో విజయం సాధించడంతో.. అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Read this News To : T20 Worldcup 2021: దంచికొట్టిన భారత బ్యాట్స్‌మెన్... దుమ్మురేపిన టీమిండియా...

స్కాట్లాండ్ తో మ్యాచ్ లో 3-15 తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును జడేజా అందుకున్నాడు.  దాదాపు ఎనిమిది వికెట్లే తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ సందర్భంగా జడేజా మాట్లాడుతూ... తామంతా ఒక జట్టుగా.. గత మూడేళ్లుగా స్వదేశంలో, బయట ఫార్మాట్ లలో నిలకడగా ఆడామని చెప్పాడు.

తాము కొన్ని మ్యాచ్ లలో ఆఫ్ కలర్ గా ఉండొచ్చు.. కానీ దాని ద్వారా తమను అంచనా వేయడం తప్పు అని జడేజా పేర్కొన్నాడు. టోర్నమెంట్ లో టాస్ కీలక పాత్ర పోషించిందని.. దానివల్లే గేమ్ ఛేంజ్ అయిపోయింది.  తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం సవాలుగా మారిందని.. బంతి సర్ఫేస్ పై పట్టుకోవడంతో పాటు కాస్త ఆగిపోయిందని జడేజా పేర్కొన్నాడు.

చివరి గ్రూప్ మ్యాచ్‌లో గెలిస్తే సరిపోదని జడేజా అంగీకరించాడు, అయితే తప్పు జరిగిన దాని గురించి ఆలోచించడం అర్థరహితమని చెప్పాడు.

click me!