Yashasvi Jaiswal: ఇంగ్లాండ్ పై డబుల్ సెంచరీతో అదరగొట్టిన టీమిండియా యంగ్ ప్లేయర్, స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు సంబంధించి.. 'ఎన్ని కష్టాలు వచ్చినా పోరాడుతాం.. ఎప్పటికీ లోంగిపోము' అంటూ వ్యాఖ్యానించి స్ఫూర్తిని నింపే అతని వీడియో వైరల్ గా మారింది.
Yashasvi Jaiswal video: విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియ యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. మిగతా ప్లేయర్లు పెద్దగా రాణించలేకపోయిన ఈ గ్రౌండ్ లో పరుగుల వరద పారించాడు. అయితే, ప్రతికూల పరిస్థితుల మధ్య సంచలన బ్యాటింగ్ తో రాణించిన జైస్వాల్ అచంచల సంకల్పానికి సంబంధించిన ఒక పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రామీణ ప్రాంత నేపథ్యం నుంచి టీమిండియాలో కీలక ప్లేయర్ గా జైస్వాల్ ఎదిగిన తీరు అతని స్ఫూర్తికి, స్థితిస్థాపకతకు నిదర్శనం.
10 ఏళ్ల వయసులోనే జైస్వాల్ తన క్రికెట్ కలలను సాకారం చేసుకునేందుకు ఇంటిని వదిలి వెయ్యి మైళ్ల ఒంటరి ప్రయాణం ప్రారంభించాడు. ఆజాద్ మైదానంలో ఒక గుడారంలో నివసించడం సహా అనేక సవాళ్లను, కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, క్రికెట్ పట్ల అతని అభిరుచి చెక్కుచెదరలేదు. డెయిరీ షాపులో పనిచేయడం నుంచి తన ప్రతిభను గుర్తించిన కోచ్ వద్ద ఆశ్రయం పొందడం వరకు జైస్వాల్ ప్రయాణంలో ఎదర్కొన్న అడ్డంకులను అధిగమించడానికి అవసరమైన ధైర్యానికి, సంకల్పానికి నిదర్శనం.
అండర్-19 ప్రపంచకప్ లో సెమీస్ చేరిన భారత్
తన గురువు జ్వాలా సింగ్ మార్గదర్శకత్వంతో యశస్వి జైస్వాల్ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ముంబై క్రికెట్ సర్కిల్స్ లో తిరుగులేని ప్లేయర్ గా ఎదిగాడు. అతని అంకితభావం, పట్టుదల అండర్19 టీమ్, జాతీయ సీనియర్ జట్టులో కీలక ప్లేయర్ గా ఎదగడానికి తొడ్పాటును అందించింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో టీమిండిమా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాతో జైస్వాల్ మాట్లాడుతూ.. "ముంబైలో వర్షం కురిసినప్పుడు, ఆజాద్ మైదానం మోకాళ్ల వరకు వరద వస్తుంది. గుడారం వరద నీరుతో నిండిపోతుంది. ఇక వేసవిలో ఇది చాలా వేడిగా ఉంటుంది. వర్షపు నీరు నిండిన ప్రదేశాన్ని ఖాళీ చేసి, పొడిగా ఉండే ప్రదేశం కోసం చూసేవాళ్లం. కరెంటు కూడా ఉండేది కాదు. కానీ నేను దాన్ని ఆస్వాదించేవాడిని.. వావ్, ఇలాంటి జీవితం అందరికీ దక్కడం అదృష్టం కాదు, నేను చాలా అదృష్టవంతుడిని'' అనుకున్నాను. నేను కష్టపడి పనిచేయాలనుకుంటున్నాను. నన్ను నేను తృప్తి పరచుకోవాలనుకున్నాను. నేను పోరాడుతూనే ఉంటాను.. ఎప్పుడూ వదులుకోను... వెనుకడుగు వేయను.. ఇదొక్కటే నేను ఆలోచించాను. సచిన్ టెండూల్కర్ లాంటి ఆటగాళ్ల మ్యాచ్ చూసినప్పుడల్లా స్ఫూర్తి పొందేవాడిని అని పేర్కొన్నాడు.
The very inspiring story of Yashasvi Jaiswal
Coming from humble background to having great start to international career. Becomes The youngest Indian to score a double hundred pic.twitter.com/Ruxfzw1ggC
కాగా, విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 396 పరుగులకు ఆలౌట్ అయింది. జైస్వాల్ అద్భుతమైన డబుల్ సెంచరీతో భారత బ్యాటింగ్ భారాన్ని తన యువ భుజాలపై మోశాడు.
Maiden DOUBLE HUNDRED for Yashasvi Jaiswal 🔥🔥
TAKE. A. BOW 🙌
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV | | | pic.twitter.com/uTvJLdtDje
యశస్వి జైస్వాల్ తొలి డబుల్ సెంచరీ.. భారత 2వ ఓపెనర్‌గా సరికొత్త రికార్డు