IND vs ENG: సీనియర్లు రాణించకపోయినా..  సెంచరీతో మెరిసిన యశస్వి జైస్వాల్ 

By Rajesh Karampoori  |  First Published Feb 3, 2024, 3:41 AM IST

IND vs ENG: విశాఖపట్నం వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ నేడు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా భారీస్కోర్ సాధించింది. ఆ మ్యాచ్ లో యువ బ్యాట్స్ మెన్ యశస్వీ జైస్వాల్ తన ఆటతీరుతో అభిమానులను కట్టిపడేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈక్రమంలో శతకాన్ని నమోదు చేశారు. మొత్తానికి టీమిండియా భారీ స్కోర్ చేసింది.  


IND vs ENG: విశాఖలోని  డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో టీమిండియా రెండో టెస్టు ఆడుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. రోహిత్, గిల్, అయ్యర్ వంటి సీనియర్లు విఫలమైన చోట.. టీమిండియా యంగ్ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌సెంచరీతో కదం తొక్కాడు. తన ఆటతీరుతో అభిమానులను కట్టిపడేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.

నిజంగా ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. 257 బంతుల్లో (17 ఫోర్లు, ఐదు సిక్సర్లు ) 179 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. డబుల్ సెంచరీ దిశగా అడుగులేస్తున్నారు. రోహిత్ శర్మ(14), గిల్‌ (34), శ్రేయాస్ అయ్యర్(27), పటీదార్‌(32), అక్సర్ పటేల్(27) పరుగులు చేశారు. అదే సమయంలో అశ్విన్ 10 బంతుల్లో ఐదు పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో యశస్వి తప్ప మరే బ్యాట్స్‌మెన్ అంతగా రాణించలేకపోయారు. దీంతో తొలిరోజు ఆట ముగిసేసరికి భారత జట్టు 93 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 336 పరుగులు చేసింది.

Latest Videos

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు.. రోహిత్ శర్మ(14), యశస్వి జైస్వాల్‌ లు తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించారు. కాగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ 14 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌(34) తన ఆటతీరుతో మెప్పినా.. ఆండర్సన్ బౌలింగ్‌లో వెనుదిరాల్సి వచ్చింది.  ఆ సమయంలో శ్రేయాస్ అయ్యర్- జైస్వాల్ జోడి టీమిండియా స్కోర్ బోర్డును కాసేపు పరుగులు పెట్టించారు. కానీ శ్రేయాస్ అయ్యర్ 27 పరుగుల వద్ద వెనుదిరిగాడు. మరోవైపు ఈ క్రమంలో జైస్వాల్ 151 బంతుల్లో సెంచరీ మార్క్ చేరుకున్నాడు. అయ్యర్ స్థానంలో క్రీజులోకి వచ్చిన పటీదార్(32) కాసేపు రాణించారు. ఆయన తొలి మ్యాచ్ లో భారీ ఇన్నింగ్స్ ఆశించినా.. రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో ఫెవిలియన్ కి చేరుకున్నాడు.  

ఆపై క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ కూడా కేవలం 27 పరుగులు చేయగలిగాడు. ఇక శ్రీకర్ భరత్ 17 పరుగుల వద్ద  ఔటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ చెరో రెండు వికెట్లు తీశారు. టామ్ హార్ట్లీ, జేమ్స్ అండర్సన్ లకు చెరో వికెట్ దొరికింది. ఈ రోజు మ్యాచ్ కు జో రూట్ కు నిరాశ ఎదురైంది. 14 ఓవర్లు వేసినా జో రూట్‌కు వికెట్ దక్కలేదు. మొత్తానికి టీమిండియా ఆట ముగిసే సమయానికి ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం జైస్వాల్‌ (165), అశ్విన్ (5) క్రీజులో ఉన్నారు.

రికార్డు సృష్టించిన యశస్వి 

23 ఏళ్ల యశస్వి  భారత్‌లోనూ, విదేశాల్లోనూ టెస్టుల్లో సెంచరీ సాధించిన నాల్గవ బ్యాట్స్‌మెన్‌గా  నిలిచాడు. వెస్టిండీస్‌లో జరిగిన తొలి టెస్టులో యశస్వి 171 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ తరుపున మెరుపు సెంచరీ సాధించాడు. యశస్వి కంటే ముందు రవిశాస్త్రి, సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ ఈ రికార్డు సాధించారు. విశేషమేమిటంటే ఈ నలుగురు ఆటగాళ్లు ముంబై రంజీ జట్టులో ఆడిన వారే. మ్యాచ్‌లో మొదటి రోజు జైస్వాల్ 179 పరుగులు చేశాడు. ఏ టెస్టులోనైనా మొదటి రోజు అత్యధిక పరుగులు చేసిన భారతీయుల క్లబ్‌లో చేరాడు. ఈ జాబితాలో అతను ఆరో స్థానంలో ఉన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ 228 పరుగులతో అగ్రస్థానంలో నిలువడంతో పాటు 195 పరుగులతో రెండో స్థానంలో180 పరుగులతో ఐదు స్థానంలో నిలిచారు. వసీం జాఫర్ 192 పరుగులతో మూడో స్థానంలో, శిఖర్ ధావన్ 190 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నారు.

click me!