విరాట్ కోహ్లీ లేక‌పోవ‌డం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే..

By Mahesh Rajamoni  |  First Published Jan 24, 2024, 8:22 AM IST

India vs England : ఐసీసీ టెస్ట్ వరల్డ్ చాంపియన్‌షిప్ టోర్నీలో భాగంగా భార‌త్-ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జ‌ర‌గ‌నుంది. అయితే, మొద‌టి రెండు టెస్టుల‌కు విరాట్ కోహ్లీ దూరం కావ‌డం జ‌ట్టుకు పెద్ద‌దెబ్బ అని రాహుల్ ద్ర‌విడ్ అన్నారు. 
 


India vs England - Virat Kohli: ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా భార‌త్-ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య హైద‌రాబాద్ వేదిక‌గా జ‌న‌వ‌రి 25న‌ తొలి టెస్టు జ‌ర‌గ‌నుంది. అయితే, ఈ సిరీస్ లో మొద‌టి రెండు టెస్టు మ్యాచ్ ల‌కు టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ దూరం అయ్యాడు. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాల‌ని చూస్తున్న భారత జట్టుకు ఇది పెద్ద ఎదురుదెబ్బే. ఈ క్ర‌మంలోనే భార‌త జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ రాహుల్ ద్ర‌విడ్ మాట్లాడుతూ.. కోహ్లీ లేక‌పోవ‌డం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ‌గా పేర్కొన్నారు. అలాగే, కోహ్లీ గైర్హాజరీ మిగతా ఆటగాళ్లకు బాగా రాణించేందుకు పెద్ద అవకాశమని కూడా వెల్ల‌డించాడు.

కాగా, వ్యక్తిగత కారణాలతో భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు విరాట్ కోహ్లీ తొలి రెండు మ్యాచ్ ల‌ నుంచి తప్పుకున్నాడు. వ్య‌క్తిగ‌త కార‌ణాలు అని పేర్కొన్నారు కానీ, దీనికి అసలు కారణం తెలియాల్సి ఉంది. అయితే కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని అభిమానులు, మీడియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్ర‌క‌ట‌న‌లో విజ్ఞప్తి చేసింది. విరాట్ కోహ్లీ జ‌ట్టుకు దూరం కావ‌డం భార‌త్ కు  పెద్ద ఎదురుదెబ్బే. ఎందుకంటే ఇంగ్లాండ్ పై విరాట్ కు అద్భుత‌మైన రికార్డు ఉంది. ఎప్పుడైనా జ‌ట్టులో రాణించ‌గ‌ల ప్లేయ‌ర్. ఇప్పటివరకు ఇంగ్లాండ్ తో ఆడిన 28 టెస్టుల్లో 42.36 సగటుతో 1991 పరుగులు చేశాడు.

Latest Videos

undefined

INDIA VS ENGLAND: ముప్పు పొంచి ఉంది.. బాజ్ బాల్ పై రాహుల్ ద్ర‌విడ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

రాహుల్ ద్ర‌విడ్ మాట్లాడుతూ.. 'విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయ‌ర్ జ‌ట్టులో లేక‌పోవ‌డం ఏ జట్టుకైనా ఇది పెద్ద ఎదురుదెబ్బే. అందులో ఎలాంటి సందేహం లేదు. విరాట్ ఒక‌ అద్భుతమైన ఆటగాడు. అత‌ని ఆట‌, రికార్డులు అన్నీ ఇవి చెబుతున్నాయి. ఆన్ ఫీల్డ్ లో విరాట్ ఉండ‌టం భారీ మార్పుల‌ను క‌లిగిస్తుంది. కానీ అత‌ను జ‌ట్టులో లేక‌పోవ‌డం ఇత‌ర ఆట‌గాళ్లు భారీ ఇన్నింగ్స్ ఆడ‌టానికి కూడా పెద్ద అవకాశంగా భావిస్తున్నా' అని ద్రవిడ్ పేర్కొన్నాడు. అలాగే, తొలి రెండు మ్యాచ్ లకు కోహ్లీ అందుబాటులో వుండ‌టం లేద‌నీ, జట్టులో కోహ్లీ మోస్తున్న బాధ్యతను మిగతా ఆటగాళ్లు భుజాన వేసుకుంటార‌ని చెప్పారు.

ఐదు టెస్టుల సిరిస్ లో భాగంగా భార‌త్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ జనవరి 25న హైదరాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. 

ఉత్త‌మ క్రికెట‌ర్‌గా గిల్.. రవిశాస్త్రికి సీకేనాయుడు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్.. బీసీసీఐ అవార్డులు పూర్తి జాబితా

తొలి టెస్టుకు 11 మంది భారత ఆటగాళ్ల అంచ‌నా.. 

1. రోహిత్ శర్మ (ఓపెనర్/కెప్టెన్)
02. యశస్వి జైస్వాల్ (ఓపెనర్)
03. శుభ్ మ‌న్ గిల్ (బ్యాట‌ర్)
04. శ్రేయాస్ అయ్యర్ (బ్యాటర్)
5. కేఎల్ రాహుల్ (బ్యాటర్)
6. కేఎస్ భరత్ (వికెట్ కీపర్/ బ్యాటర్)
7. రవీంద్ర జడేజా (ఆల్ రౌండర్)
8. రవిచంద్రన్ అశ్విన్ (ఆల్ రౌండర్)
9. అక్షర్ పటేల్ (ఆల్ రౌండర్)
10. జస్ప్రీత్ బుమ్రా (ఫాస్ట్ బౌలర్)
11. మహ్మద్ సిరాజ్ (ఫాస్ట్ బౌలర్)

India vs England: సిక్స‌ర్ల మోత‌.. ధోని రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌నున్న రోహిత్ శ‌ర్మ !

click me!