ICC ODI Team of the year 2023: మనోళ్లే ఆరుగురు..మెన్స్ వ‌న్డే టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్‌ ను ప్రకటించిన ఐసీసీ

Published : Jan 24, 2024, 04:30 AM IST
ICC ODI Team of the year 2023: మనోళ్లే ఆరుగురు..మెన్స్ వ‌న్డే టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్‌ ను ప్రకటించిన ఐసీసీ

సారాంశం

ICC ODI Team of the year 2023:  వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌ 2023ని ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్‌లో భారత ఆటగాళ్ల ఆధిపత్యం కనిపించింది. ఈ జట్టులో రోహిత్ శర్మ,  విరాట్‌తో సహా ఆరుగురు టీమిండియా బ్యాట్స్ మెన్స్ అవకాశం దక్కింది. 

ICC ODI Team of the year 2023: ICC ODI టీమ్ ఆఫ్ ది ఇయర్‌ని ప్రకటించింది. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్‌లో భారత ఆటగాళ్ల ఆధిపత్యం కనిపించింది. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. ఇది కాకుండా.. విరాట్ కోహ్లీతో సహా మొత్తం 6 మంది భారత ఆటగాళ్లు ఐసిసి వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌కు ఎంపికయ్యారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్‌లకు చోటు దక్కింది. 

ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్‌లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యారు. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ నంబర్-3కి ఎంపికయ్యాడు. ఇది కాకుండా.. భారత దిగ్గజం విరాట్ కోహ్లీ ,  న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్ వరుసగా 4, 5 స్థానాల్లో నిలిచారు. ఇక దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ వికెట్ కీపర్‌గా ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్‌లో చోటు దక్కించుకున్నాడు. అలాగే.. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో యూన్సెన్ ఐసిసి వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో చోటు సంపాదించడంలో విజయం సాధించాడు.


అలాగే.. ఆస్ట్రేలియా తరఫున ఆడమ్ జంపా, భారత్ తరఫున కుల్దీప్ యాదవ్ ఇద్దరు స్పిన్నర్లు ఎంపికయ్యారు. దీంతో పాటు భారత ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలకు చోటు దక్కింది. ఈ విధంగా ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్‌లో అత్యధికంగా 6 మంది భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల నుంచి చెరో ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. న్యూజిలాండ్ నుండి కేవలం ఒక్క ఆటగాడికి మాత్రమే చోటు దక్కింది. 

ICC ODI టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023-

  1. రోహిత్ శర్మ (కెప్టెన్), 
  2. ట్రావిస్ హెడ్,
  3. విరాట్ కోహ్లీ,
  4. డారిల్ మిచెల్,
  5. హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్),
  6. మార్కో యూన్‌సెన్,
  7. ఆడమ్ జంపా,
  8. కుల్దీప్ యాదవ్,
  9. మహ్మద్ సిరాజ్,  
  10. మహ్మద్ షమీ.
     

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : టీ20 క్రికెట్ అంటే అంతే బాసూ.. సూర్యకుమార్ యాదవ్ భయం అదే !
Cricketers Assault : ఎంతకు తెగించార్రా..గ్రౌండ్ లోనే క్రికెట్ కోచ్‌ తల పగలగొట్టిన ప్లేయర్స్ !