India Vs England: ముప్పు పొంచి ఉంది.. బాజ్ బాల్ పై రాహుల్ ద్ర‌విడ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

By Mahesh RajamoniFirst Published Jan 24, 2024, 7:52 AM IST
Highlights

India Vs England: జ‌న‌వ‌రి 25 నుంచి హైద‌రాబాద్ వేదిక‌గా భార‌త్-ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య తొలి టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో 'బాజ్ బాల్' గురించి రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ.. ముప్పు పొంచి వుంద‌ని తెలుసునంటూ కామెంట్స్ చేయ‌డం వైర‌ల్ గా మారింది. 
 

India Vs England - Rahul Dravid: భార‌త్-ఇండియా మ‌ధ్య ఐడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఫిబ్రవరి 25 నుంచి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌నల్ స్టేడియంలో ఇరు జట్ల మ‌ధ్య తొలి టెస్టు జ‌ర‌గ‌నుంది. బాజ్ బాల్ నేప‌థ్యంలో భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ పై ఉత్కంఠ నెలకొంది. కెప్టెన్ బెన్ స్టోక్స్, హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ సారథ్యంలో విజ‌య‌పరంప‌ర‌ను కొన‌సాగిస్తున్న ఇంగ్లాండ్.. కేవలం నాలుగు టెస్టుల్లో మాత్రమే ఓడిపోయింది. అయితే, భార‌త్ ఆడ‌బోయే టెస్టు సిరీస్ లో ఇంగ్లాండ్ బాజ్ బాల్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

స్వ‌దేశంలో టెస్టుల్లో భార‌త్ కు తిరుగులేని విజ‌య చ‌రిత్ర ఉంది. సొంతగడ్డపై భారత్ 11 ఏళ్ల అజేయ యాత్ర‌కు ముగింపు పలకాలని భావిస్తున్న త్రీ లయన్స్ జట్టును టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అంత‌తేలిక‌గా తీసుకునే ఆలోచనలో లేర‌ని తెలుస్తోంది. తొలి టెస్టుకు ముందు మాట్లాడిన రాహుల్ ద్రవిడ్ 'బాజ్ బాల్' ఆటతీరుతో పొంచి ఉన్న ముప్పును అంగీకరించాడు. "వారు ఆడటం చూడటం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది.. అలా ఆడటంలో విజయం సాధించారు. పాకిస్థాన్ లో మంచి ప్రదర్శన కనబరిచారు. న్యూజిలాండ్ లో విజయం సాధించిన ఆ జట్టు యాషెస్ లోనూ ఆస్ట్రేలియాపై ఉత్కంఠభరితంగా ఆట‌ను కొన‌సాగించింది. కాబట్టి దాన్ని మనం గౌరవించాలి' అని ద్రవిడ్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ ను తాము ఒత్తిడిలోకి నెట్టుతామ‌నీ, త‌మ ప్లేయ‌ర్ల‌కు ఏలా ఆడాలో తెలుసున‌ని అన్నాడు.

Latest Videos

ఉత్త‌మ క్రికెట‌ర్‌గా గిల్.. రవిశాస్త్రికి సీకేనాయుడు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్.. బీసీసీఐ అవార్డులు

ఇక భారత పరిస్థితులకు అలవాటు పడటం ఇంగ్లాండ్ కు సవాలుతో కూడుకున్నదనీ, అయినప్పటికీ భారత బౌలింగ్ పై ఒత్తిడి తీసుకురావడానికి తాను వారికి మద్దతు ఇస్తున్నానని ద్రవిడ్ పేర్కొన్నాడు. 'కానీ ఈ పరిస్థితుల్లో ఇది వారికి సవాలుగా మారుతుందని మాకు తెలుసు, ఎందుకంటే ఇవి మాకు బాగా తెలిసిన పరిస్థితులు. మా దాడిలో మాకు చాలా అనుభవం ఉంది. మా కుర్రాళ్లు ఎలా స్పందిస్తారో చూడాలని ఎదురుచూస్తున్నాను, ఎందుకంటే మేము ఒత్తిడికి గురవుతామని నాకు తెలుసు' అని అన్నాడు. బాజ్ బాల్ ను ఎదుర్కోవడంలో భారత్ విధానం గురించి మాట్లాడుతూ.. భారత్ అల్ట్రా అటాకింగ్ చేయ‌దు.. కానీ వారు చాలా రక్షణాత్మకంగా ఉండరంటూ వ్యాఖ్యానించాడు. అలాగే, అల్ట్రా ఎటాకింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని తాను అనుకోవడం లేదనీ, మన ముందు ఉన్నదాన్ని, పరిస్థితిని ఏది డిమాండ్ చేస్తుందో అది ఆడాలని అనుకుంటున్నామ‌ని తెలిపారు.

ICC ODI TEAM OF THE YEAR 2023: మనోళ్లే ఆరుగురు..మెన్స్ వ‌న్డే టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్‌ ను ప్రకటించిన ఐసీసీ

click me!