సిరీస్ మొత్తానికి కోహ్లీ దూరం.. ఇంగ్లాండ్ తో 3 టెస్టుల‌కు భార‌త జ‌ట్టు ఇదే.. !

By Mahesh Rajamoni  |  First Published Feb 10, 2024, 2:28 PM IST

India vs England: టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కు పూర్తిగా దూర‌మ‌య్యాడు. శ్రేయాస్ అయ్యర్ గాయంతో దూరంకాగా, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ తిరిగి జ‌ట్టులోకి వచ్చారు.
 


India vs England: ఇంగ్లండ్‌తో జరిగే చివరి 3 టెస్టుల కోసం టీమిండియాను బీసీసీఐ శనివారం ప్రకటించింది. 17 మంది సభ్యులతో కూడిన జట్టులో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్‌లకు చోటు దక్కలేదు. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ తిరిగి వచ్చారు. వ్యక్తిగ‌త కార‌ణాల‌తో తొలి రెండు టెస్టుల‌కు దూర‌మైన విరాట్ కోహ్లీ.. తాజా ప్ర‌క‌ట‌న‌తో ఈ సిరీస్ మొత్తానికి అందుబాటులో లేకుండా పోయాడు. జస్ప్రీత్ బుమ్రా కూడా సిరీస్‌లోని మిగిలిన 3 మ్యాచ్‌లు ఆడనున్నాడు. అంత‌కుముందు  వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా త‌ర్వాత 2 టెస్టుల‌కు విశ్రాంతి ఇవ్వ‌వ‌చ్చున‌నే వార్త‌లు వ‌చ్చాయి.

మూడో టెస్టు రాజ్ కోట్ వేదిగా ఫిబ్ర‌వ‌రి 15 నుంచి రాజ్‌కోట్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాతి రెండు టెస్టులు రాంచీ, ధర్మశాలలో జరగనున్నాయి. శుక్రవారం సాయంత్రం బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం జ‌ర‌గ్గా.. విరాట్ కోహ్లీ జ‌ట్టుకు త‌న అందుబాటులో ఉండ‌టం గురించి స‌మాచారం ఇచ్చిన‌ట్టు స‌మాచారం. కోహ్లి తన చివరి మ్యాచ్‌ను 17 జనవరి 2024న ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడాడు.

Latest Videos

AUS vs WI: వార్న‌ర్ భాయ్ విధ్వంసం.. ఆస్ట్రేలియా చేతితో వెస్టిండీస్ చిత్తు !

జ‌ట్టులోకి తిరిగివ‌చ్చిన ర‌వీంద్ర జ‌డేజా, కేఎల్ రాహుల్ 

భార‌త్ స్టార్ ప్లేయ‌ర్లు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ రెండవ టెస్ట్ కు అందుబాటులో లేకుండా పోయారు. తొలి టెస్టులో గాయపడడంతో ఇద్దరూ రెండో మ్యాచ్ ఆడలేకపోయారు. అయితే, రాబోయే మూడు టెస్టుల‌కు జ‌ట్టులో చోటుక‌ల్పించారు. అయితే, వీరిద్దరూ ఫిట్‌గా ఉంటేనే ప్లేయింగ్-11లో చోటుక‌ల్పించ‌నున్న‌ట్టు బీసీసీఐ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

సిరీస్‌కు దూరమైన శ్రేయాస్ అయ్యార్

శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. రెండో టెస్టు తర్వాత వెన్నునొప్పి రావ‌డంతో అత‌నికి విశ్రాంతిని ఇచ్చారు. తొలి రెండు టెస్టుల్లోనూ శ్రేయాస్ అయ్యార్ ప‌ద్ద‌గా రాణించ‌లేక‌పోయాడు. 4 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధసెంచరీ కూడా సాధించ‌లేక‌పోయాడు. మరోవైపు రెండో టెస్టు ఆడలేకపోయిన మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అలాగే, ఆకాశ్ దీప్‌ను కూడా జట్టులో చేర‌గా, మధ్యప్రదేశ్‌కు చెందిన అవేష్ ఖాన్ రంజీ ట్రోఫీ ఆడేందుకు విడుదలయ్యాడు.

రవీంద్ర జడేజా, అతని భార్య రివాబా పై తండ్రి షాకింగ్ కామెంట్స్..

చివరి 3 టెస్టులకు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.

కాగా, భార‌త్-ఇంగ్లాండ్ 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్ర‌స్తుతం 1-1తో సమం ఉంది. హైదరాబాద్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. విశాఖపట్నంలో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తుచేసింది. మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో జరగనుంది. ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో నాలుగో టెస్టు, మార్చి 7 నుంచి ధర్మశాలలో 5వ టెస్టు జరగనున్నాయి.

20 ఫోర్లు 8 సిక్స‌ర్లతో శ్రీలంక క్రికెట‌ర్ విధ్వంసం.. వ‌న్డేల్లో మ‌రో డ‌బుల్ సెంచ‌రీ !

click me!