AUS vs WI: వార్న‌ర్ భాయ్ విధ్వంసం.. ఆస్ట్రేలియా చేతితో వెస్టిండీస్ చిత్తు !

By Mahesh Rajamoni  |  First Published Feb 9, 2024, 9:06 PM IST

Australia vs West Indies: డేవిడ్ వార్న‌ర్ మ‌రోసారి ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. దీంతో మొదటి T20లో ఆస్ట్రేలియా 11 పరుగుల తేడాతో వెస్టిండీస్ పై విజయం సాధించింది. అలాగే, 3 పార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ గా వార్న‌ర్ భాయ్ చ‌రిత్ర సృష్టించాడు.
 


Australia vs West Indies: ఉత్కంఠ‌గా సాగిన ఆస్ట్రేలియా vs వెస్టిండీస్ సిరీస్ లోని తొలి టీ20లో కంగారు టీమ్ విజ‌యం సాధించింది. డేవిడ్ వార్న‌ర్ త‌న బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించారు. 36 బంతుల్లో 70 ప‌రుగులు చేసి విండీస్ పై ఆస్ట్రేలియా గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు. వార్న‌ర్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, ఒక సిక్స‌ర్ బాదాడు. హోబర్ట్‌లో జరిగిన ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వ‌చ్చింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా వెస్టిండీస్‌కు 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. డేవిడ్ వార్న‌ర్ హాఫ్ సెంచరీతో చెల‌రేగాడు. అతడితో పాటు జోష్ ఇంగ్లిస్ 39, టిమ్ డేవిడ్ 37 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరఫున డేవిడ్ వార్నర్ అత్యధికంగా 70 పరుగులు చేశాడు. 36 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. జోష్ ఇంగ్లిస్ 25 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 39 పరుగులు చేశాడు.

Latest Videos

రవీంద్ర జడేజా, అతని భార్య రివాబా పై తండ్రి షాకింగ్ కామెంట్స్..

టిమ్ డేవిడ్ 17 బంతుల్లో 37 పరుగులు చేశాడు. త‌న ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. వెస్టిండీస్‌ తరఫున రస్సెల్‌తో పాటు అల్జారీ జోసెఫ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ తీశారు. 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వెస్టిండీస్‌కు మంచి శుభారంభం లభించింది. అయితే, లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్‌ల మధ్య తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం ల‌భించింది.

బ్రాండ‌న్ కింగ్ 37 బంతుల్లో 53 పరుగులు చేశాడు. అతని సోదరుడు చార్లెస్ 25 బంతుల్లో 42 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. జాసన్ హోల్డర్ 34 పరుగులతో నాటౌగ్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా తరఫున ఆడమ్ జంపా మూడు వికెట్లు పడగొట్టాడు. మార్కస్ స్టోయినిస్ రెండు వికెట్లు, షాన్‌ అబాట్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, జాసన్‌ బెహ్రెండార్ఫ్ ల‌కు ఒక్కో వికెట్ దక్కింది. డేవిడ్ వార్న‌ర్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

రోహిత్ శ‌ర్మ‌-హార్దిక్ పాండ్యాల‌ మ‌ధ్య ముంబై చిచ్చు..

వార్న‌ర్ స‌రికొత్త రికార్డు.. 

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వార్నర్ మ‌రో ఘ‌న‌త సాధించాడు. ఆస్ట్రేలియా తరఫున మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అంత‌ర్జాతీయంగా మూడో ఆటగాడు. వార్న‌ర్ కంటే ముందు మూడు భారత ఆటగాడు విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్‌కు చెందిన రాస్ టేలర్ ఈ ఘనత సాధించారు. దీంతో పాటు టీ-20లో 100వ మ్యాచ్ ఆడిన మూడో ఆస్ట్రేలియా ఆటగాడిగా వార్నర్ నిలిచాడు.

భారత్ కు మరో బిగ్ షాక్.. మరో స్టార్ ప్లేయర్ IND vs ENG సిరీస్ నుంచి ఔట్.. !

click me!