Sri Lanka vs Afghanistan: వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి శ్రీలంక క్రికెటర్ గా పాతుమ్ నిస్సాంక చరిత్ర సృష్టించాడు. అఫ్గానిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో పాతుమ్ నిస్సాంకా 20 ఫోర్లు, 8 సిక్సర్లతో విధ్వంసకర బ్యాటింగ్ తో డబుల్ సెంచరీ (210 పరుగులు) సాధించాడు.
Sri Lanka vs Afghanistan - Pathum Nissanka: వన్డే క్రికెట్ లో మరో డబుల్ సెంచరీ నమోదైంది. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ శ్రీలంక క్రికెటర్ పాతుమ్ నిస్సాంక డబుల్ సెంచరీ కొట్టాడు. ఫోర్లు.. సిక్సర్లతో విరుచుకుపడుతూ ఆప్ఘనిస్తాన్ బౌలింగ్ ను ఉతికిపారేశాడు. శ్రీలంక తరఫున డబుల్ సెంచరీ సాధించిన ఏకైక ప్లేయర్ గా పాతుమ్ నిస్సాంక చరిత్ర సృష్టించాడు.
వివరాల్లోకెళ్తే.. వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి శ్రీలంక క్రికెటర్ గా పాతుమ్ నిస్సాంకా రికార్డు నెలకోల్పాడు. ఫిబ్రవరి 9 శుక్రవారం పల్లెకెలెలో అఫ్గానిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో నిస్సాంకా ఈ ఘనత సాధించాడు. కేవలం 136 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్, గ్లెన్ మాక్స్వెల్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. పాతుమ్ నిస్సాంక తన ఇన్నింగ్స్ లో 20 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు.
undefined
రవీంద్ర జడేజా, అతని భార్య రివాబా పై తండ్రి షాకింగ్ కామెంట్స్..
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 3 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. అవిష్కా ఫెర్నాండోతో కలిసి ఓపికగా ఇన్నింగ్స్ ఆడిన నిస్సాంకా అద్భుతమైన షాట్లను ఆడుతూ డబుల్ సెంచరీ కొట్టాడు. ఓపెనర్లు 26.2 ఓవర్లలో 182 పరుగులు చేయగా, అవిష్క ఫెర్నాండో 88 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత నిస్సాంకా గేర్ మార్చి అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. 139 బంతుల్లో 210 పరుగులతో అజేయంగా నిలిపాడు.
Pathum Nissanka created history when he scored a double-hundred 👏 | More ➡️ https://t.co/O6hUwrWwRu pic.twitter.com/uawgPgNpgt
— ICC (@ICC)డబుల్ సెంచరీ కొట్టిన 10 ప్లేయర్ గా పాతుమ్ నిస్సాంక
వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన 10వ ఆటగాడిగా పాతుమ్ నిస్సాంకా నిలిచాడు. అతని కంటే ముందు భారత్ కు చెందిన సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ లతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మాక్స్ వెల్, న్యూజిలాండ్ కు చెందిన మార్టిన్ గప్తిల్, పాకిస్తాన్ కు చెందిన ఫకార్ జమాన్, వెస్టిండీస్ కు చెందిన క్రిస్ గేల్ ఈ ఘనత సాధించారు. కాగా, పాతుమ్ నిస్సాంకా కంటే ముందు 2000లో భారత్ పై సనత్ జయసూర్య చేసిన 189 పరుగులే శ్రీలంక బ్యాటర్స్ కు నుంచి ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డుగా ఉంది.
AUS VS WI: వార్నర్ భాయ్ విధ్వంసం.. ఆస్ట్రేలియా చేతితో వెస్టిండీస్ చిత్తు !